అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యులు షాక్

|

May 16, 2024 | 4:28 PM

అవును కొందరికి మలవిసర్జన సాఫీగా జరుగదు. దీనికి కారణం జీవనశైలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఒక వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లి వార్తల్లో నిలిచాడు. వారానికి 2 లేదా 3 సార్లు కాదు ఏకంగా మూడు నెలల పాటు మలవిసర్జన చేయలేదు. దీంతో అతను డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు.. అతని పరీక్షించిన డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు.

అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యులు షాక్
Constipation
Image Credit source: Pixabay/Reddit)
Follow us on

ప్రతి వ్యక్తీ జీవితంలో మలవిసర్జన ఒక సాధారణ ప్రక్రియ. మనం ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మలవిసర్జన చేయడం కూడా అంతే ముఖ్యం, ఎందుకంటే టాయిలెట్‌కి వెళ్లకపోతే మలబద్ధకం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టాయిలెట్‌కి వెళ్తారు. అయితే ప్రపంచంలో వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే మల విసర్జన చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. అవును కొందరికి మలవిసర్జన సాఫీగా జరుగదు. దీనికి కారణం జీవనశైలే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఒక వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లి వార్తల్లో నిలిచాడు. వారానికి 2 లేదా 3 సార్లు కాదు ఏకంగా మూడు నెలల పాటు మలవిసర్జన చేయలేదు. దీంతో అతను డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు.. అతని పరీక్షించిన డాక్టర్ కూడా ఆశ్చర్య పోయాడు.

ది సన్ నివేదిక ప్రకారం ఒక వైద్యుడు తన రోగులలో ఒకరి స్కాన్ నివేదికను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో షేర్ చేశాడు. అతను ఒకటి లేదా రెండు కాదు ఏకంగా మూడు నెలలు సరిగ్గా మలవిసర్జన చేయలేదని పేర్కొన్నాడు. CT స్కాన్‌లో రోగి కడుపులో పెద్ద రాయి లాంటి వస్తువు కనిపించిందని.. ఇలా సాధారణ ప్రజలకు కనిపించదని డాక్టర్ చెప్పారు. ఇలా రాయిలా కనిపిస్తున్నా రోగి కడుపులో గట్టిపడిన మలం అని చెప్పారు. CT స్కాన్ చేసిన తర్వాత రోగిని చివరిసారిగా ప్రేగు కదలిక ఎప్పుడు జరిగిందని.. మలవిసర్జన ఎప్పుడు చేశారని డాక్టర్ అడగగా, అతను మూడు నెలల క్రితం చెప్పాడు. ఇది విన్న డాక్టర్ షాకింగ్ తిన్నట్లు పేర్కొన్నాడు.

సోషల్ మీడియా వినియోగదారులు ఏమంటున్నారంటే..

ఇవి కూడా చదవండి

ఈ ఉదంతం మూడు నెలల పాటు మల విసర్జన చేయకుండా ఎలా బతకాడో అని ఆలోచించేలా చేసింది. ప్రజలు రకరకాలుగా రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఓహ్ గాడ్, నేను రెండు రోజులు టాయిలెట్ కు వెళ్ళక పొతే చాలు చాలా బాధపడతాను అని చెప్పారు. ఇక మూడు నెలలు మల విసర్జన చేయకుండా జీవించడం అంటే అసలు ఊహించలేనని పేర్కొన్నాడు.

3 months FOS
byu/xray12589 inRadiology

అతను ఏ వ్యాధితో బాధపడుతున్నాడంటే

నివేదికల ప్రకారం కొంతమంది వైద్యులు రెడ్డిట్‌లోని పోస్ట్ కు స్పందిచారు. రోగి ఫీకల్ ఇంపాక్షన్ అనే రుగ్మతతో బాధపడుతున్నాడని చెప్పారు. దీనినే దీర్ఘకాలిక మలబద్ధకం అని కూడా అంటారు. అనేక వారాల పాటు మలవిసర్జన చేయక పోవడంతో భారీ మొత్తంలో మలం పురీషనాళంలో పేరుకుపోయి క్రమంగా పొడిబారి గట్టిపడుతుందని వెల్లడించారు. ఈ వ్యాధికి ఏకైక చికిత్స ఏమిటంటే, వైద్యులు మలాన్ని తడిపి మృదువుగా చేసి శరీరం నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..