సముద్రంలో నేటికీ లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున దాగివున్న రహాస్యాలను చేధించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సైన్స్ నేడు చాలా అభివృద్ధి చెందింది. ఈ రోజు మానవులు ఆ చంద్రునిపై కూడా తమ స్వంత ప్రపంచాన్ని స్థాపించగలిగారు. కానీ సముద్రగర్భ ప్రపంచం ఇప్పటికీ, మనకు ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ అనేక వింత, విచిత్రమైన ఎప్పుడూ చూడని అనేక మిస్టీరియస్ జీవులు ఉన్నాయి. వాటి గురించి ఇంకా పెద్దగా సమాచారం తెలియదు..అటువంటి ఆశ్చర్యకరమైన ప్రపంచంలోని అతిపెద్ద జంతువు బ్లూ వేల్ గురించి ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకుందాం..
నీలి తిమింగలం ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు..
ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత ప్రత్యేకమైన జంతువు అంటార్కిటిక్ బ్లూ వేల్. ఇది సముద్రాన్ని పాలిస్తుందని చెబుతారు. నీలి తిమింగలాలు అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్, దక్షిణ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి.
నీలి తిమింగలం బరువు..
నీలి తిమింగలం దాదాపు 4,00,000 పౌండ్ల బరువు ఉంటుంది. ఒక తిమింగలం 33 ఏనుగుల బరువు ఉంటుంది. ఇది దాదాపు 98 అడుగుల పొడవు ఉంటుంది. దాని నాలుక బరువు ఒక్కటే ఏనుగు బరువుతో సమానం.
పరిమాణం
నీలి తిమింగలం పరిమాణం డైనోసార్ కంటే పెద్దది. అతిపెద్ద డైనోసార్ అస్థిపంజరం పొడవు 27 మీటర్లుగా అని ఒక అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో, నీలి తిమింగలం చేప పరిమాణం 30 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ.
బ్లూ వేల్ గురించి ఆసక్తికరమైన విషయాలు
– ఇది ఒక క్షీరదం, ఇది భూమిపై అతిపెద్ద జంతువు మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద స్వరం కలిగినది కూడా.
– నీలి తిమింగలం శబ్దం జెట్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. దాని అరుపు శబ్దం వందల మైళ్ల దూరం నుండి వినబడుతుంది.
– ఒక జెట్ ఇంజన్ 140 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అయితే తిమింగలం 188 డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.
– నీలి తిమింగలం జీవితకాలం చాలా ఎక్కువ. దాదాపు 80-90 సంవత్సరాల వరకు జీవిస్తుంది.
– తిమింగలం గుండె దాదాపు ఒక కారు అంత సైజు ఉంటుంది. ఇది భూమిపై అతిపెద్ద జంతువు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందనుకుంటా..
ఈ చేపకు మొప్పలు ఉండవు, కానీ మనుషుల మాదిరిగానే ఊపిరితిత్తులు ఉన్నాయి, కాబట్టి తిమింగలం ప్రతి నిమిషం ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి రావాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..