Viral video: పాత యజమానిపై ప్రేమ.. కనిపించడంతోనే ఇలా కౌగిలించుకుంది..

పెపుడు జంతువులు ఎంతో ప్రేమతో విశ్వాసంతో ఉంటాయి. యజమాని పట్ల ప్రేమ చూపిస్తాయి. పాత యజమానిపై బెంగతో ఓ పెంపుడు ఒంటె చేసిన పని నెటిజన్లను మనసులను దోచుకుంది.

Viral video: పాత యజమానిపై ప్రేమ.. కనిపించడంతోనే ఇలా కౌగిలించుకుంది..
Heart Touching Video Clip C

Updated on: Feb 16, 2022 | 1:42 PM

పెపుడు జంతువులు ఎంతో ప్రేమతో విశ్వాసంతో ఉంటాయి. యజమాని పట్ల ప్రేమ చూపిస్తాయి. పాత యజమానిపై బెంగతో ఓ పెంపుడు ఒంటె చేసిన పని నెటిజన్లను మనసులను దోచుకుంది. తన యాజమాని వెతుక్కుంటూ ఏకంగా వందల కిలోమీటర్ల దూరం ఒంటరిగా ప్రయాణం చేసి చివరికి తన ఓనర్‌ను చేరుకుంది. ఈ ఘటనను మరిచిపోక ముందే తాజాగా పెంపుడు ఒంటె వీడియో ఒకటి మరో సారి వైరల్ అవుతోంది. సౌదీ అరేబియాలో హృదయాన్ని హత్తుకునే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మాజీ యజమానిని కలిసిన ఒంటె అతనిని ఆలింగనం చేసుకుంది. వదలడానికి నిరాకరించింది. అతను ఎంత చెప్పిన ససేమిర అంది. ఒక సౌదీ వ్యక్తి తన ఒంటెను గతంలో వేరొకరికి విక్రయించాడు. కొంతకాలం తర్వాత.. దాని మాజీ యజమాని పాత ఒంటెను చూసేందుకు వెళ్ళాడు. అయితే ఒంటె స్పందన చూసి ఆశ్చర్యపోయాడు.


గతంలో కూడా అచ్చు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోలో, ఒంటె అతనిని ఆలింగనం చేసుకోవడం .. అతని మెడ చుట్టూ చుట్టడం చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరి అనుబంధం చూసిన నెటజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.

ఒంటెలు సౌదీ అరేబియా వారసత్వ సంపద.. అక్కడికి ఒంటెకు ఉండే సంబంధం అంత గొప్పది . ఈ జంతువు చాలా కాలంగా “ఎడారి ఓడ” అని పిలుస్తారు. ఇది ఎడారి నివాసుల జీవనాధారం.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?