ప్రపంచంలో అనేక రకాల జాతులకు చెందిన జంతువులు నివసిస్తున్నాయి. వాటిల్లో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. చిరుత, పులి, సింహం లాంటి క్రూర జంతువుల వేట అత్యంత భయానకంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇక పక్షులలోనూ కొన్ని ప్రిడెటర్లు ఉంటాయి. వాటిల్లో ఒకటి డేగ. డేగ చూపు చాలా పదునైనది. ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్నప్పటికీ.. భూమిపై తాను ఎంచుకున్న ఎరను కంటి చూపు నుంచి దూరం కాకముందే వేటాడగలదు. అవి వాయువేగంతో తమ ఎరను వేటాడతాయి. డేగ వేట ఎట్టుంటుందో మీకు తెలుసా.? ఎప్పుడైనా చూశారా.! అయితే ఈ వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది.
వైరల్ వీడియో ప్రకారం.. భూమిపై ఉన్న కుందేలును అల్లంత దూరం నుంచి చూసిన డేగ.. వాయువేగంతో ఎగురుతూ దాన్ని పట్టుకునేందుకు దూసుకొస్తుంది. ఇక తనకు ఎడురుస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన కుందేలు.. డేగ నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఏం లాభం.. డేగ క్షణాల్లో దాని పదునైన గోర్లతో కుందేలును బంధీగా చేసుకుంటుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జింక లాంటి పెద్ద జంతువులను కూడా వేటాడగల సత్తా డేగకు ఉంది. అందుకే డేగను పక్షులలో అత్యంత భయంకరమైన ప్రిడేటర్ పక్షిగా పిలుస్తుంటారు.
కాగా, ఈ వీడియోను ‘naturecorner’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి 1 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 32 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Also Read: కేవలం 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్.. ఎవరో తెలుసా?