Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు దర్శనమిస్తాయి. కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని హాస్య వీడియోలు, ఇంకొన్ని భయంకర వీడియోలు ఉంటాయి. నెటిజన్లు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మరికొన్ని వీడియోలు అయితే నమ్మలేకుండా ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాధారణంగా మేకలు గడ్డి తిన్నాయంటే నమ్ముతారు కానీ చేపలు తిన్నాయంటే ఎవరైనా నమ్ముతారా..? మనుషులు మేకలను తింటుంటే ఈ మేక మాత్రం చేపలు తింటుంది. వీడియో చూస్తే మీరు కూడా షాకవుతారు..
ఈ వీడియోలో ఒక చేపల బుట్ట మేక ముందు ఉండటం మనం గమనించవచ్చు. కొద్దిసేపటికి మేక బుట్టలో ఉన్న చేపను నోటితో పట్టుకొని నమలడం చేస్తుంది. మేక ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపను తినడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ మాంసాహారం మేకను చూస్తే అందరు షాక్ అవుతున్నారు. అయితే సాధారణంగా మేక గడ్డి, ఆకులు, ధాన్యాలు తింటుంది. కానీ ఈ మేక చాలా ఉత్సాహంతో చేపను నములుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు చాలామంది వీక్షించారు. లైకులు, కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా అంటున్నాడు మొట్టమొదటిసారిగా నేను ఒక మేక చేపలు తినడం చూశానన్నాడు. మరొకరు మటన్.. ఫిష్ తినడం ఇదే మొదటిసారి అన్నాడు. ప్రజలు ఈ ఫన్నీ వీడియోని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా షేర్ చేస్తున్నారు.