హనుమాన్ జయంతి రోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మహరాష్ట్రలోని ఓ ప్రాంతంలో కొండముచ్చులు ఎంతో బుద్ధిగా సహపంక్తి భోజనం చేశాయి. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్ర అకోలా జిల్లా బాషిటేకడి తాలూడా కోతడి గ్రామంలోని ముంగాసాజి మహరాజ్ ఆశ్రమంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు.
ముందుగా ఆహారం వడ్డించడానికి ప్లేట్లు పెట్టారు. అప్పుడు దానిని తమకు ఆహ్వానంగా అందుకున్న వానర సైన్యం నేరుగా చెట్టు నుండి క్రిందికి దిగి వచ్చి వరుసగా కూర్చున్నాయి. ఒక్కో కోతికి ఒక ప్లేటు ఆహారం ఇచ్చారు. ఈ వంటకంలో మంచి స్వీట్ల విందు కనిపించింది.
अकोला : हनुमान जयंतीला चक्क वानरसेनेची पंगत, VIDEO पाहून तुम्हीही म्हणाल ‘हनुमान की जय’ pic.twitter.com/dCLV6V8hmX
— Renuka Dhaybar (@renu96dhaybar) April 7, 2023
ఆశ్రమ నిర్వాహకులు వాటిని చెదరగొట్టకుండా ఆ మూగజీవులకు కూడా భోజనం వడ్డించారు. అవి కూడా తమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఎంతో భక్తితో బుద్ధిగా కూర్చుని మనుషులతో కలిసి సహపంక్తి భోజనం చేశాయి.
अकोला : हनुमान जयंतीला चक्क वानरसेनेची पंगत, VIDEO पाहून तुम्हीही म्हणाल ‘हनुमान की जय’ pic.twitter.com/V931g6RSWa
— Maharashtra Times (@mataonline) April 7, 2023
ఆ దృశ్యం చూడ్డానికి ‘క్రమశిక్షణలో మాకు మించినవారు లేరు’ అన్నట్టుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి తెగ వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఔరా.. ఎంత భక్తి.. ఇవి కొండముచ్చులా.. వానర సైన్యమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వానరాల క్రమశిక్షణ మనుషులకు కూడా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు కొందరు..
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..