Viral: ఫ్రెండ్‌కి పంపబోయి.. ఆ ఫోటోను ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాడు.. దెబ్బకు ఇజ్జెత్ పోయిందిగా.!

|

May 29, 2023 | 11:35 AM

చదువు, ఉద్యోగం, లేదా ఇతర అంశాలు ఏదైనా కూడా ఇటీవల యువత కుటుంబానికి దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. కట్ చేస్తే..

Viral: ఫ్రెండ్‌కి పంపబోయి.. ఆ ఫోటోను ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాడు.. దెబ్బకు ఇజ్జెత్ పోయిందిగా.!
Viral
Follow us on

చదువు, ఉద్యోగం, లేదా ఇతర అంశాలు ఏదైనా కూడా ఇటీవల యువత కుటుంబానికి దూరంగా ఉంటూ సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. కట్ చేస్తే.. వారివారి వాట్సాప్‌లలో గ్రూప్‌లు ఎక్కువైపోతున్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్.. ఇలా అనేక గ్రూప్‌లు దర్శనమిస్తాయి. అయితే ఇన్నీ గ్రూప్‌లు ఉండటం కూడా ఒక్కోసారి లాభాల కంటే.. అనర్ధాలే ఎక్కువే తెచ్చిపెడతాయి. సరిగ్గా ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన ఫ్రెండ్‌కు పంపబోయి.. ఒక్క ఫోటోతో తన ఇజ్జెత్ తీసుకున్నాడు. ఆ ఫోటో ఏంటి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచినప్పుడు.. మనోడు సెలబ్రేషన్స్ చేసుకుంటూ బీర్ తాగుతున్నాడు. తన చేతిలో బీర్ క్యాన్ పెట్టుకుని.. ఆ ఫోటోను ఫ్రెండ్‌కి పంపించాలనుకుని.. పొరపాటున ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. వారి రియాక్షన్స్‌కు అతడి ఇజ్జెత్ కాస్తా పోయింది.

ఆ ఫోటోను చూడగానే ‘ఏంట్రా ఇది’.. అని తండ్రి షాకై మెసేజ్ చేయగా.. కొద్దిసేపటికి ‘నువ్వు బీర్ తాగుతావా’ అంటూ తల్లి ఫైర్ అయింది. ఇలా రియాక్షన్స్ వస్తున్నా.. సదరు బీర్ ఫోటోను మనోడు ఎంతసేపైనప్పటికీ డిలీట్ చేయలేదు. గ్రూప్‌లో జరుగుతున్న రచ్చకు.. యువకుడి సోదరి.. అతడికి ప్రైవేటు‌గా మెసేజ్ చేయగా.. ‘కంగారులో డిలీట్ ఫర్ ఎవరీవన్ బదులు నా ఫోన్లోనే డిలీట్ చేశాను’ అంటూ తిరిగి రిప్లయ్ ఇచ్చాడు. ఇక అతడి పరిస్థితిని చూసి నవ్వాపుకోలేకపోయిన ఆమె.. ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. కాగా, ఈ వార్త ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.