Watch: పులిని పట్టుకునేందుకు వచ్చిన ఏనుగు.. అదుపుతప్పి ఏం చేసిందంటే..

పులిని పట్టుకునే ఆపరేషన్ కోసం తీసుకువచ్చిన శిక్షణ పొందిన ఏనుగు అదుపుతప్పింది. ప్రధాన రహదారి వెంట విచ్చలవిడిగా పరిగెత్తడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. అదుపు తప్పిన ఏనుగు స్థానిక బస్టాండ్‌, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విధ్వంసం సృష్టించింది. పులిని పట్టుకునే ఆపరేషన్‌లో సహాయం చేయడానికి నియమించబడిన అటవీ శాఖ బృందంలో ఈ ఏనుగు కూడా ఉంది.

Watch: పులిని పట్టుకునేందుకు వచ్చిన ఏనుగు.. అదుపుతప్పి ఏం చేసిందంటే..
Elephant

Updated on: Nov 10, 2025 | 11:27 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో అదుపు తప్పిన ఏనుగు వీధిలో విధ్వంసం సృష్టిస్తూ కనిపిస్తుంది. ఇది రోడ్డుపై పరిగెడుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంది.. ఈ వైరల్ వీడియోను @dpkBopanna అనే యూజర్ సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో, కర్ణాటకలోని గుండ్లుపేటలో జరిగిన సంఘటనను యూజర్ వివరించాడు. అక్కడ ఒక ఏనుగు అకస్మాత్తుగా నగర వీధిలో అదుపు తప్పి పడిపోయింది.

వీడియో శీర్షికలో ఇలా ఉంది.. శిక్షణ పొందిన ఏనుగును పులిని వెతుకుతూ అడవి నుండి తీసుకువచ్చారని వివరించారు. అకస్మాత్తుగా, ఏనుగు రోడ్డుపై నియంత్రణ కోల్పోయి నగరం గుండా పరుగెత్తడం ప్రారంభించింది. అటవీ శాఖ టైగర్ కూంబింగ్ బృందంలో భాగమైన ఏనుగు బస్ స్టాండ్, స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోకి వెళ్లడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీశారు. కానీ, అదృష్టవశాత్తూ, ఎవరికీ గాయాలు కాలేదు. తరువాత కొందరు మావటీ వారు అటవీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి

సంఘటన సమయంలో ఏం జరిగింది?

అటవీ శాఖ బృందం ఆ ప్రాంతంలో పులి కోసం వెతుకుతోంది. ఆపరేషన్‌లో పాల్గొన్న ఏనుగు అకస్మాత్తుగా అదుపు తప్పిపోయింది. అది నగరంలోకి దూసుకెళ్లి, బస్ స్టాండ్‌లోని ప్రయాణికులను, పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. బిగ్గరగా ఏనుగు అరుపులు వినిపించాచయని చెప్పారు. కానీ, ఏనుగు ఎవరికీ హాని చేయలేదని చెప్పారు.

ఏనుగు బీభత్సానికి అసలు కారణం…

ఏనుగు అదుపు తప్పటానికి అసలు కారణం ఏంటో అటవీ అధికారులు వెల్లడించారు. ఆ ఏనుగుపై అకస్మాత్తుగా కీటకాలు దాడి చేశాయని అధికారులు తెలిపారు. ఆ కీటకాల కాటు వల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యం కలిగింది. అది భయపడి నగరంలోకి తిరుగుతూ వచ్చింది. శిక్షణ పొందినప్పటికీ, అది నియంత్రణ కోల్పోయింది. అధికారుల ప్రకారం, అడవిలో ఇటువంటి కీటకాలు సర్వసాధారణం. కానీ, ఈసారి దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఏనుగు దానిని తట్టుకోలేకపోయింది.

వీడియో ఇక్కడ చూడండి..

పరిస్థితిని ఎలా నిర్వహించారు?

ఏనుగు వికృత ప్రవర్తన గురించి సమాచారం అందుకున్న అటవీ అధికారులు, మావటీ వారు వెంటనే రంగంలోకి దిగారు. వారు ఏనుగును శాంతింపజేయడానికి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించారు. కొంత ప్రయత్నం తర్వాత ఏనుగును అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం, దాని కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరగకుండా నిరోధించడానికి అధికారులు దానిని సురక్షితంగా బండిపూర్, చుట్టుపక్కల అడవిలో తిరిగి వదలాలని యోచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..