How to make Gulab Jamun Burger: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని ఊరికే అనలేదు. కొత్త దనాన్ని కోరుకునే ఆహార ప్రియులు ఈ జిందగీలో దండిగానే ఉన్నారండోయ్! దాల్ మఖానీ ఐస్ క్రీం రోల్స్, మ్యాగీ పానీ పూరీ, చాక్లెట్ బిర్యానీ.. వంటి చిత్రవిచిత్రమైన ఆహారాలను కనిపెట్టడమేకాకుండా, వీటికి సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. ఇక నెటిజన్లేమో వావ్.. సూపర్ కాంబినేషన్ అంటూ చప్పట్లు కొట్టడం ఈ మధ్య షరా మామూలైపోయింది. పేరు వింటుంటేనే కడుపులో దేవినట్లౌతుంది కదా? ఇలాంటి విచిత్రమైన ఆహారాల జాబితాల సరసన తాజాగా గులాబ్ జామూన్ బర్గర్ చోటు దక్కించుకుంది. అదేంటి? గులాబ్ జామూన్ బర్గర్ పేరే.. విచిత్రంగా ఉందే.. అని అనుకుంటున్నారా? అవునండి.. పేరులోనే ఉంది దాని ప్రత్యేకత. గులాబ్ జామూన్ బర్గర్ తయారీ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు చూసి తరించడండి..
ముందుగా గుండ్రని బ్రెడ్‌ను మధ్యలో కట్ చేసి.. చిక్కని చక్కెర పాకంలో నిగనిగలాడే గులాబ్ జామ్‌ను పేర్చి, ఆ తర్వాత దానిపై తియ్యని చక్కెర పాకాన్ని కొన్ని చుక్కలు చల్లి.. తెరచి ఉన్న బ్రెడ్ ముక్కను మూసి .. గ్యాస్‌పై వేడిగా ఉన్న పెనంపై ఉంచడం ఈ వీడియోలో కనిపిస్తుంది. కాస్త వేడి చేశాక గులాబ్ జామూన్ బర్గర్‌ను సర్వ్ చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ‘ప్రజెంటింగ్ గులాబ్ జామన్ బర్గర్’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్ చేశారు.
Presenting Gulab Jaman Burger! pic.twitter.com/6mU5a0YQZN
— T (@Tabeshq) September 19, 2022
Presenting Gulab Jaman Burger! pic.twitter.com/6mU5a0YQZN
— T (@Tabeshq) September 19, 2022
Presenting Gulab Jaman Burger! pic.twitter.com/6mU5a0YQZN
— T (@Tabeshq) September 19, 2022
ఈ కొత్త రకం బర్గర్ వీడియోను నెటిజన్లు విపరీతంగా వీక్షిస్తున్నారు. లక్షల్లో వ్యూస్, వేలలో కామెంట్లతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌లో గులాబ్ జామూన్ పరాటను చూశాను. విచిత్రమైన ఆహారాలను తయారు చేస్తున్నారని ఒకరు, కొత్త ఆహారాలను కనిపెట్టడంలో ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాం.. ఎటువంటి మసాలా వాడకుండానే తయారు చేసేయొచ్చని మరొకరు, ఓహ్ గాడ్.. ఇది ఇల్లీగల్ వంటకం’ అని ఇంకొకరు కామెంట్ సెక్షన్‌లో సరదాగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పేరు ఏదయినా.. ఈ స్వీట్ బన్‌ను మీరు కూడా ఓ సారి ట్రై చేయండి..