Water Tank Collapsed Video: అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన వాటర్ ట్యాంకు. దానితోనే ఆ గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. ఆ ట్యాంకు ఇళ్ల పక్కనే శిథిలావస్థలో ఉన్నప్పటికీ.. అధికారులు గుర్తించలేకపోయారు. తీరా ఆ వాటర్ ట్యాంకు ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టం ఎంటంటే ఆ వాటర్ ట్యాంకు కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేరు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్ జునాఘడ్‌లోని కేశోద్ ప్రాంతం ఖీర్సారా గ్రామంలో చోటుచేసుకుంది. రెప్పపాటులో వాటర్ ట్యాంక్ నేలమట్టమై.. ఆ ప్రాంతమంతా జలమయమైంది. నీరు ప్రళయంలా ఎగసిపడ్డాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యంతోనే ట్యాంకు నేలమట్టమైందని, పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వైరల్ వీడియో..
#WATCH | Gujarat: A 40-year-old overhead water tank in Khirsara village of Junagadh collapsed earlier today. No injuries or casualties were reported in the incident. pic.twitter.com/4XyMQ5fCiq
— ANI (@ANI) July 30, 2021
Also Read: