టాలీవుడ్ చిత్రపరిశ్రమలో లవర్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోలలో ఈ చిన్నోడు ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించి నటనపరంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిన్నోడి ఫ్యామిలీ మొత్తం స్టార్ హీరోస్ అయిన.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. మీకు మరో క్లూ.. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది.
పైన హీరోను దాదాపు గుర్తుపట్టే ఉంటారు కదా. కింగ్ నాగార్జున చేతిలో ఉన్న ఆ అల్లరి కన్నయ్య మరెవరో కాదు. స్టార్ హీరో సుమంత్. ప్రేమ కథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సత్యం, గౌరి, ధన 51, మహానంది, గోదావరి, మధుమాసం, యువకుడు, చిన్నోడు, స్నేహమంటే ఇదేరా, క్లాస్ మేట్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరమైన సుమంత్.. ఇటీవల మళ్లీ రావా, మళ్లీ మొదలైంది సినిమాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా సూపర్ హిట్ మూవీ సీతారామంలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.