Watch Video: ట్రైన్‌లో గర్ల్స్ గ్యాంగ్ డ్యాన్స్.. నెట్టింట వైరలవుతున్న వీడియో
సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు రీల్స్‌ను తెగ వాడేస్తున్నారు. అలాగే ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది.
సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా, వింతగా ఏదైన రీల్ చేస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు రీల్స్‌ను తెగ వాడేస్తున్నారు. అలాగే ఈ మధ్య రీల్స్ చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న కొంతమంది యువతులు చేసిన రీల్ వీడియో నెట్టింటా వైరలవుతోంది. ఓ ట్రెండింగ్ పాటకు ఆ యువతులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ షార్ట్ క్లిప్‌లో యువతుల బృందం ఓ ట్రెండింగ్ సాంగ్ బీట్స్‌కు తగ్గట్లుగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. అయితే వీళ్లలో ఇద్దరు వేర్వేరు బెర్త్‌లపై క్రేజీ మూమెంట్స్ ఇవ్వగా మిగిలినవారంతా మిగత స్టెప్పులు వేస్తారు.
అయితే ఈ వీడియోను ఇప్పటివరకు 45,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మరికొందరూ యువతుల తీరుపై విమర్శలు కూడా చేశారు . నాలో ఇంత కాన్ఫిడెన్స్ లేదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ముందు మెట్రో, ఇప్పుడు ట్రైన్లను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందని మరో యూజర్ విమర్శించాడు.
Bhai mere se train mein logo ke aage khana bhi khaya nhi jata?? pic.twitter.com/esLxk9ymom
— whydahi(Himesh’s version) (@vaidehihihaha) May 4, 2023
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..