Viral Video: వధువు డ్యాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

|

Oct 17, 2021 | 9:05 AM

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకం.. వివాహబంధంతో ఇద్దరూ వ్యక్తులు మాత్రమే కాకుండా.. రెండు కుటుంబాలు

Viral Video: వధువు డ్యాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Viral
Follow us on

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకం.. వివాహబంధంతో ఇద్దరూ వ్యక్తులు మాత్రమే కాకుండా.. రెండు కుటుంబాలు ఒక్కటిగా మారడం.. పెళ్లి వేడుక జరిగే ఇంట్లో బంధువులు… మేళతాళలు.. డ్యాన్సులతో ఎంతో కోలహాలంగా ఉంటుంది. ఇక ఈ వేడుకలో చిన్నా, పెద్ద అందరూ ఎంతో సంతోషంగా చిందులేస్తుంటారు. అయితే ఈ వేడుకలలో జరిగే సన్నివేశాలు కూడా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. ఇటీవల కాలంలో అమ్మాయిలు.. అబ్బాయిలు తమ పెళ్లి వేడుకలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వధువరులు డ్యాన్స్ చేయడం రోటీన్.. కానీ.. వరుడు కోసం వధువు డ్యాన్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది.

బుల్లెట్టు బండి పాటకు వరుడి కోసం చేసిన వధువు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి కూతురు కూడా వరుడి కోసం ప్రత్యేకమైన పాటకు డ్యాన్స్ చేసింది. వధువు ఎంతో అందంగా డ్యాన్స్ చేయడం చూసి పెళ్లి కొడుకు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో వధువు అతడి దగ్గరకు వచ్చి.. డ్యాన్స్ చేయడానికి తీసుకెళ్లగా.. ఆసమయంలో మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు వరుడు.. దీంతో ఆమె అతని కన్నీళ్లను తుడిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ..అతను తన భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాడని.. క్యూట్ కపూల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 13,558 లైక్స్ వచ్చాయి. వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి…

Also Read: Prabhas: ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. సందీప్ వంగా సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్… 

Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిల్ పొందిన సీలబ్రిటీల గురించి తెలుసా?

Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..