ఒంటెపై ఊరేగిన వరుడికి ఝలక్ ఇచ్చిన పోలీసులు… 26 మందిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..

|

Jan 18, 2024 | 11:21 AM

గత వారం జరిగిన పెళ్లికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో, వరుడు టాకీ, బ్యాండ్‌తో ఒంటెపై వస్తున్నట్లు చూడవచ్చు. పెళ్లి వేడుకకు వధువు కుటుంబం వ్యతిరేకించింది. అయితే వేడుకకు నాయకత్వం వహిస్తున్న వరుడి స్నేహితులు ఈ మాట వినలేదు. ఫలితంగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది..

ఒంటెపై ఊరేగిన వరుడికి ఝలక్ ఇచ్చిన పోలీసులు... 26 మందిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..
Groom On A Camel
Follow us on

పెళ్లికి వరుడిని ఒంటెపై తీసుకొచ్చిన ఘటనలో వరుడితోపాటు 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడు గుర్రం బగ్గీ, వాహనాలు వదిలిపెట్టి ఒంటెపై రావడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఘటన కేరళ్లోని కన్నూర్‌లో చోటుచేసుకుంది. వలపట్టణకు చెందిన వరణ్ రిజ్వాన్, అతనితో పాటు వచ్చిన 25 మందిపై చకరకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం జరిగిన పెళ్లికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియోలో, వరుడు టాకీ, బ్యాండ్‌తో ఒంటెపై వస్తున్నట్లు చూడవచ్చు. పెళ్లి వేడుకకు వధువు కుటుంబం వ్యతిరేకించింది. అయితే వేడుకకు నాయకత్వం వహిస్తున్న వరుడి స్నేహితులు ఈ మాట వినలేదు. మితిమీరిన వేడుకల కారణంగా కన్నూర్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. రోడ్డు దిగ్బంధనం చేసిన వారిపై పోలీసులు లాఠీలు ప్రయోగించారు. ఒంటెల ఊరేగింపు, పటాకులు పేల్చడం, బ్యాండ్ సౌండ్‌లో రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ఫలితంగా విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్‌లతో సహా అనేక వాహనాలు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వారిని అక్కడ్నుంచి తరిమివేశారు.. వరుడు సహా 26 మందిపై చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించిన అధికారులు కేసు నమోదు చేశారు. ఒంటె స్వారీకి సంబంధించిన వీడియోలు వివిధ సోషల్ నెట్‌వర్క్‌లలో కనిపించాయి.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో పెద్ద ఎత్తున నెటిజన్లు నుంచి స్పందన వస్తోంది. పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ.. ప్రజల కష్టాలు పెంచడం సరికాదన్నారు. వరుడు పెళ్లి విషయంలో కొంచెం ఉత్సాహంగా ఉన్నాడని కొందరు చెప్పారు. మితిమీరిన ఇలాంటి ప్రవర్తను క్షమించాలంటూ మరికొందరు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..