AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లిలో వరుడికి షాక్‌.. ఫ్రెండ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ చూసి నివ్వెరపోయిన వధువు.. వీడియో వైరల్‌

Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వుకునేలా చేస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి సరదా

Viral Video: పెళ్లిలో వరుడికి షాక్‌.. ఫ్రెండ్‌ ఇచ్చిన గిఫ్ట్‌ చూసి నివ్వెరపోయిన వధువు.. వీడియో వైరల్‌
Groom Friends Gave Funny Gi
Shaik Madar Saheb
| Edited By: Phani CH|

Updated on: Sep 13, 2021 | 9:02 AM

Share

Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వుకునేలా చేస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి సరదా వీడియోల్లో వివాహానికి సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఒక పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియో చూసి.. పెళ్లి కొడుకును స్నేహితులు హర్ట్‌ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో పెళ్లికొడుకును అతని స్నేహితులు ఆటపట్టించారు. అదికూడా ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చి.. వరుడికి చికాకు తెప్పించారు. దీనిని చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియోలో అసలేముందంటే.. వివాహ వేడుక అనంతరం ఫోటో సెషన్ ప్రారంభమైంది. వధూవరుల దగ్గరికి వరుడి స్నేహితుడు వెళతాడు. అనంతరం తన స్నేహితుడైన వరుడికి బహుమతినిస్తాడు. అది ఫుల్లుగా మంచిగా ప్యాక్ చేసి ఉంది. దానిని తెరవమని చెబుతాడు. అయితే.. అదేంటోనని వధువు బహుమతి వైపు ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఆ గిఫ్ట్ బాక్స్‌లో అసలేం దాగి ఉందో చూడాలని.. వరుడు ప్యాక్‌ను విప్పుతుంటాడు. అయితే.. దానిపై కవర్లు ఫుల్లుగా ప్యాక్ చేసి ఉండటంతో వాటిని.. తీస్తూ ఉంటాడు. ఒక కవర్ తెరిచిన వెంటనే, మరొక కవర్ కనిపిస్తూ ఉంటుంది. అలా కష్టపడి బహుమతిని తెరచిన అనంతరం దానిలో ఏమీ ఉండదు. ఖాళీ బాక్స్‌ మాత్రమే కనిపిస్తుంది. వరుడు నిరాశ చెంది గిఫ్ట్‌ బాక్స్‌ను విరివేస్తాడు.

వీడియో..

అయితే.. వధువు ముందు స్నేహితుడు ఆటపట్టించడంతో వరుడు కొంచెం హర్ట్‌ అయ్యాడు. అనంతరం స్నేహితుడు.. వధువు, వరుడి చేతులను కలిపి కిందకు తిగుతాడు. అయితే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేదీ తెలియరాలేదు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోని Instagram_ official_niranjanm87లో మీరు కూడా చూడండి.

Also Read:

Viral Video: మెరుపు వేగంతో పరిగెత్తి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్… వాచ్ వీడియో

Bullet Bandi Song: కమింగ్ సూన్… వెండితెరపై డుగుడుగు పాట.. ఎలాగంటే…?