Wedding: కొత్త పెళ్లి కొడుక్కి ఎన్ని కష్టాలో.. గుర్రం లేకపోవడంతో గాడిదపై ఊరేగింపు.. ఆతర్వాత ఏమైందంటే?

|

Oct 31, 2022 | 8:55 AM

గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఒక పెళ్లి కుమారుడు ఏకంగా గాడిదపై ఊరేగింపుగా వెళ్లాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Wedding: కొత్త పెళ్లి కొడుక్కి ఎన్ని కష్టాలో.. గుర్రం లేకపోవడంతో గాడిదపై ఊరేగింపు.. ఆతర్వాత ఏమైందంటే?
Groom Baarat
Follow us on

పెళ్లి వేడుకల్లో బరాత్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా వరుడిని గుర్రం, కారు లేదా ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాలపై ఎంతో ఆడంబరంగా ఊరేగిస్తారు. డప్పులు, వాయిద్యాలతో వరుడిని పెళ్లి మండపానికి తీసుకొస్తారు. కొన్నిచోట్ల వరుడిని సైకిళ్లపై ఊరేగించిన సంఘటనలు ఉన్నాయనుకోండి .. ఆది వేరే విషయం. ఇప్పుడు మాత్రంచాలావరకు వరుడి ఊరేగింపునకు గుర్రాలే ఫస్ట్‌ చాయిస్‌. అయితే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఒక పెళ్లి కుమారుడు ఏకంగా గాడిదపై ఊరేగింపుగా వెళ్లాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ  బరాత్ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ఉంటాడు. అతని బంధువులు దాని ముందు డ్యాన్సులు, నృత్యాలు చేస్తారు. మహిళలు కూడా హారతులు పడతారు. అలా వరుడు ఆ గాడిదపైనే ఊరుగుతూ పెళ్లి మండపానికి చేరుకుంటాడు. ఫన్‌టాప్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘గుర్రం లేకపోతేనేమీ గాడిద ఉందిగా’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

కాగా బరాత్‌ సందర్భంగా వరుడు గాడిదపై ఊరేగిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. లాఫింగ్‌ ఎమోజీలతో పాటు పలు జోకులు వేస్తూ తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. ‘ఇది నా ఫ్రెండ్‌ పెళ్లి’ అని ఒకరు కామెంట్‌ చేస్తే.. కొత్త పెళ్లి కొడుక్కి అప్పుడే ఎన్ని కష్టాలొచ్చాయో అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరి నవ్వులు పూయిస్తోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..