ఒకప్పుడు 16 రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి అంటూ జరిగేవి. కాలక్రమేనా ఇప్పుడు అది రెండు రోజులు, ఒక్కరోజుకే పరిమితమైపోయింది. ఆ మధ్య జరిగే వివాహాలను కూడా కొన్ని కుటుంబాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా జరపుకుంటున్నాయి. కొంచెం డబ్బున్నవాళ్లు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, రిసార్టులు, ప్యాలెస్‌లలో అధికంగా ఖర్చు చేసి పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా వరుడ్ని ఏనుగు లేదా గుర్రాలపై ఊరేగిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ఓ కుటుంబం మాత్రం తమ పెళ్లి వేడుకను విచిత్రంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే గుడమాలని గ్రామంలోని ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తికి.. రోలీ గ్రామానికి చెందిన మమతో పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రోజున వరుడుతో సహా 200 మంది అతిథులు 51 ట్రాక్టర్లలో వధువు ఇంటికి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. వరుడు ఉన్న ట్రాక్టర్ వెనుక మిగతా అన్ని ట్రాక్టర్లు రావడాన్ని చూసి స్థానికులు చూపు తిప్పుకోలేకపోయారు. అలాగే ముందున్న ట్రాక్టర్‌లో వరుడే వాహనాన్ని నడపడం మరో విశేషం.
అయితే ఇలా కొత్తగా పెళ్లి ఊరేగింపు చేయాలనే ఆలోచన వరుడి తండ్రిదే. వరుడి తండ్రి జెతారాం మాట్లాడుతూ.. మా నాన్న, తాతయ్యకు అప్పట్లో పెళ్లి వేడుకల్లో భాగంగా ఒంటెలపై ఊరేగించారని.. నా పెళ్లికి ట్రాక్టర్‌పై ఊరేగించారని చెప్పారు. అందుకే నా కొడుకు కోసం 51 ట్రాక్టర్లతో ఈ ఊరేగింపును ఏర్పాటు చేశామని తెలిపారు. తన కుటుంబంలో 20 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఉన్నాయని.. అలాగే తన రైతు మిత్రుల వద్ద మరికొన్ని ఉన్నాయని చెప్పారు. ఇలా మొత్తం 51 ట్రాక్టర్లతో ఈ ఊరేగింపు చేశామన్నారు. పెళ్లికూతురు గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా ఇన్ని ట్రాక్టర్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారని అన్నారు. తమ కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయమని.. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డామని వరుడు ప్రకాశ్ చౌదరి తెలిపాడు. ట్రాక్టర్లతోనే మేము వ్యవసాయం చేస్తామని.. వాటిపైనే ఎందుకు ఊరేగింపు చేయకూడదని ఆలోచన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు.
#WATCH | Rajasthan: A groom arrived with 51 tractors as part of his wedding procession, in Barmer district
The 1 km long wedding procession had over 200 guests and was led by the groom who himself was driving a tractor. pic.twitter.com/tWOYtZkaiD
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 14, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :