అధిక వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు కూల్‌డ్రింక్స్, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారు. ఇది శరీరానికి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, బయట తయారు చేసే జ్యూస్‌లు తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే.. మరింత హాని కలుగుతుందనేది మాత్రం ఈ వీడియో చూస్తే నిజమని నమ్మాల్సిందే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రజలను కలవర పెడుతోంది. ఇక్కడో జ్యూస్ దుకాణదారుడు చేసిన వికృత చేష్టలు వెలుగులోకి రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతనిపై మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందినదిగా తెలిసింది. ఇక్కడ ఒక దుకాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. జ్యూస్ తయారీకి వాడుతున్న దానిమ్మ గింజల్లో విపరీతంగా కీటకాలు సంచరిస్తుండగా ఒక కస్టమర్ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జనాలు గగ్గొలు పెడుతున్నారు. వైరల్ వీడియోలో దుకాణంలో ఎక్కడ చూసినా దుమ్ము, పురుగులు, బొద్దింకలు దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ బృందం దుకాణానికి చేరుకుని జ్యూస్‌లు, పండ్ల నమూనాలను తీసుకుంది. జ్యూస్ షాపు యజమానిపై ఎస్‌డిఎం కోర్టులో కేసు వేసినట్లు చెబుతున్నారు. వీడియో పాతదని, దీనిపై చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
यह अनार जूस है या फिर कॉकरोच जूस?
ग्रेटर नोएडा में ये शख्स लोगों को कॉकरोच वाला जूस पिला रहा है. आप खुद देख लीजिये. Via @GagandeepNews #Noida #LatestNews #HindiNews #ViralVideo @noidapolice pic.twitter.com/XLXBWcG8UV
— Tez Tarrar (@teztarrardelhi) June 18, 2024
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చమన్ పేరుతో ఉన్న ఈ షాప్ బయటి నుంచి మెరుస్తూ కనిపించినా షాపు లోపల మాత్రం దుమ్ము, క్రిములతో నిండిపోయింది. దుకాణం లోపల పెద్ద మొత్తంలో పండ్ల తొక్కలు, పురుగులు నిండివున్నాయి. అలాంటి జ్యూస్ తాగిన తర్వాత ఆరోగ్యవంతమైన వ్యక్తి కూడా అనారోగ్యానికి గురవుతాడు. షాపు వీడియో వైరల్ కావడంతో, ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫుడ్ డిపార్ట్‌మెంట్ టీమ్ దయ వల్లే నేడు ప్రజలు విషం తిని, తాగుతున్నారని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. అలాంటి షాపుల్లో ఆకస్మిక తనిఖీలు ఎందుకు నిర్వహించరో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..