Viral Video: నాలుకకో రుచి అన్నారు.. ఇందుకేనేమో.. పానీపూరిని ఇలా కూడా తింటారా ?

|

Jan 08, 2022 | 5:01 PM

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అనే సామేత వినే వింటారు. నిజమే.. మనిషి మనిషి ఆలోచనలు.. ప్రవర్తనలు వేరు వేరుగా ఉంటాయి.

Viral Video: నాలుకకో రుచి అన్నారు.. ఇందుకేనేమో.. పానీపూరిని ఇలా కూడా తింటారా ?
Golgappa
Follow us on

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అనే సామేత వినే వింటారు. నిజమే.. మనిషి మనిషి ఆలోచనలు.. ప్రవర్తనలు వేరు వేరుగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కో రుచి నచ్చుతుంటుంది. ఊదారణకు కొందరు నాన్ వెజ్ ఇష్టంగా లాగించేస్తుంటారు.. మరికొందరు అస్సలు తినరు. అలాగే రోజూ చేసే వంటకాలనే కాస్త విభిన్నంగా ట్రై చేస్తూ టెస్ట్ ఆస్వాదిస్తుంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని.. కొత్త కొత్తగా ట్రైచేస్తున్న వంటకాల వీడియోలను చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని వావ్ అనిపించగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. విగటు పుట్టిస్తాయి. తాజాగా పానీపూరితో శాండ్ విచ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇటీవల కాలంలో రకరకాలుగా పానీపూరిని ట్రై చేస్తున్నారు. పానీపూరి అగ్ని అంటూ తెగ లాగించేస్తున్నారు. తాజాగా పానీపూరి సాండ్‏విచ్ అంటూ వీడియోస్ చేస్తున్నారు. ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అంజలి థింగ్రా తన ఇన్‏స్టాలో పానీపూరి శాండ్‏విచ్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె.. బ్రౌన్ బ్రెడ్ పై ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి.. దానిపై టామోటాలు.. ఉల్లిపాయలు పేర్చి.. ఆ తర్వాత మరో బ్రెడ్ వేసి.. దానిపై పానీపూరి పేర్చింది. చివరగా.. దానికి మరో బ్రెడ్ జోడించి డై శాండ్‏విచ్ తయారు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..