Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు .. ఎగబడి కొంటున్న భక్తులు.. ధర ఎంతో తెలుసా..?!

|

Sep 23, 2023 | 11:10 AM

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లోని  పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ లోని ఆంజనేయ నగర్ లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయకుడికి ప్రసాదాలతో ముంచెత్తారు కాలనీ వాసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 108 రకాల ప్రసాదాలను సమర్పించి తమ భక్తిని ప్రదర్శించారు. గులాబ్ జాములు, జాంగ్రీలు, బాదుషాలు , పంచదార చిలకలు, బూరెలు, అరిసెలు, పాల కోవాలు, కారపు బూందీ, మురుకులు,చేగోడీలు,

Ganesh Chaturthi 2023 : బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు .. ఎగబడి కొంటున్న భక్తులు.. ధర ఎంతో తెలుసా..?!
Goldan Modaks
Follow us on

వినాయక చవితి అంటేనే ఊరంతా పండగ సందడి.. వీధికో వినాయక మండపం ఏర్పాటు చేసిన ఆ గణనాధుడిని కొలుస్తారు భక్తులు. వినాయక చవితి పండుగకు నెల రోజుల ముందునుంచే పండగ సందడి మొదలవుతుంది. చవితి మొదలు సుమారు 12 రోజులపాటు ఉత్సాలు, ఊరేగింపులతో ఎటు చూసినా కోలాహలంగా ఉంటుంది. ఇక ప్రతి రోజూ ఆ బొజ్జ గణపయ్యకు భక్తులు రకరకాల ప్రసాదాలను సమర్పిస్తుంటారు. అటుకులు బెల్లం మొదలు… ఆ లంబోధరుడికి ఎన్నో రకాల పండ్లు, పలహారాలు పిండి వంటలతో నైవైద్యాలు పెడుతుంటారు. ఇందులో గణేశుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు గణపతి ప్రసాదాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ ఏకదంతుడికి ఎంతో ఇష్టమైన మోదక్‌ను ఇక్కడ ఓ భక్తుడు బంగారంతో తయారు చేయించాడు. బొజ్జ గణపయ్యకు బంగారు కుడుములను నైవేద్యంగా సమర్పించారు..ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో చోటు చేసుకుంది.

వినాయకుడునీ… ఉండ్రాళ్ళ ప్రియుడని, నైవేద్య ప్రియుడని పిలుస్తారు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంతో పాటు వివిధ రకాలైన ఫలాలు సమర్పించి ఆరాధిస్తారు. గణపతికి నైవేద్యంగా పెట్టేందుకు కొంతమంది వ్యాపారులు బంగారు మోదకాలను విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో బంగారు కుడుములు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అచ్చమైన బంగారంతో చేసిన బంగారు రంగులో మెరిసిపోతున్న మోదకాలు అందరిని ఆకట్టుకంటున్నాయి. 24 క్యారెట్ల బంగారు పూతతో తయారుచేసిన కుడుములను కిలో రూ.16,000 చొప్పున అమ్ముతున్నారు వ్యాపారులు. అలాగే బంగారు కుడుములతో పాటు వెండి కుడుములు కూడా అమ్ముతున్నారు. వెండి కుడుమేల ధర రూ.1,600. బంగారు, వెండి కుడుములకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ఇప్పటికే పెద్దమొత్తంలో అమ్మకాలు చేశామని చెబుతున్నారు నాసిక్ లోని వ్యాపారులు.బంగారు కుడుముల వ్యాపారం విషయం మాత్రం వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లోని  పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ లోని ఆంజనేయ నగర్ లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయకుడికి ప్రసాదాలతో ముంచెత్తారు కాలనీ వాసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 108 రకాల ప్రసాదాలను సమర్పించి తమ భక్తిని ప్రదర్శించారు. గులాబ్ జాములు, జాంగ్రీలు, బాదుషాలు , పంచదార చిలకలు, బూరెలు, అరిసెలు, పాల కోవాలు, కారపు బూందీ, మురుకులు,చేగోడీలు, పులిహోర, దద్దోజనం ఇలా చెబుతూ పోతే ఒకటా రెండా నోరూరించే అనేక రకాల స్వీట్లు, హాట్ పదార్దాలన్నీ స్వామివారి ముందు కొలువు తీర్చారు భక్తులు. ప్రసాదాలు సమర్పించటం తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక సామూహిక పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..