Viral Video: క్లాస్ రూమ్ లో కత్రినా సూపర్ హిట్ సాంగ్ చిక్నీ చమేలీకి స్టూడెంట్ డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..

వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే విద్యార్థులు టీచర్స్ డేని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతలో ముసుగు ధరించిన ఒక అమ్మాయి అగ్నిపథ్ చిత్రంలోని చిక్నీ చమేలీ సాంగ్ కు డ్యాన్స్ చేసింది

Viral Video: క్లాస్ రూమ్ లో కత్రినా సూపర్ హిట్ సాంగ్ చిక్నీ చమేలీకి స్టూడెంట్ డ్యాన్స్..  నెట్టింట్లో వీడియో వైరల్..
Dance Viral Video

Updated on: Sep 12, 2022 | 8:29 PM

Viral Video: భాష ఏదైనా కొన్ని పాటలు ఎల్లప్పుడూ ప్రజలను అలరిస్తూనే ఉంటాయి. కొన్ని పాటలు అన్ని వయసుల వారు చూడడానికి , ఆ సాంగ్స్ కు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి సూపర్ హిట్ పాటల్లో ఒకటి చిక్నీ చమేలీ. 2012 లో రిలీజైన అగ్నిపత్‌లోని చిక్నీ చమేలీ పాటకు ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అదే విషయాన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఓ వీడియో ఉదాహరణగా నిలుస్తుంది. స్కూల్లో అమ్మాయిలు ఏ మాత్రం సమయం, సందర్భం దొరికినా డ్యాన్స్  చేస్తూ సరదాగా గడపడానికి ఆసక్తిని చూపిస్తారు.

స్కూల్‌లో  సమయం దొరికినప్పుడు స్టూడెంట్స్ సరదాగా గడిపే సందర్భాలు మీరు చూసే ఉంటారు. చాలా మంది తమలో తాము మాట్లాడుకునే సమయంలో తమ ప్రతిభను చూపించడానికి వెనుకాడని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఓ విద్యార్థిని చిక్నీ చమేలీ సాంగ్ కు  ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి: 

వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే విద్యార్థులు టీచర్స్ డేని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతలో ముసుగు ధరించిన ఒక అమ్మాయి అగ్నిపథ్ చిత్రంలోని చిక్నీ చమేలీ సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అమ్మాయి డ్యాన్స్ ను చూసి మిగిలిన స్టూడెంట్స్ కేకలు వేస్తూ.. ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో, కెమెరా క్లాస్‌రూమ్ వెనుక కూర్చున్న అబ్బాయిల వైపు చూస్తూ.. అక్కడ వారు కూడా ఈ సాంగ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ క్లాస్ వెనుక సీటుపై అద్భుతమైన డ్యాన్స్ చేశారు.

కత్రినా కైఫ్ ఈ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను అనుసరిస్తూ.. డ్యాన్స్ చేయడం చాలామందికి కష్టం. అయితే ఆ స్టూడెంట్ కత్రినాను పూర్తిగా కాపీ చేయడానికి ప్రయత్నించింది. ఫంటాప్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటికే  11 వేల  లైక్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..