Viral Video: పెళ్లి వేదికపై సంతోషంతో ఫోటోలకు ఫోజులిచ్చిన వరుడు.. ఇంతలో ట్విస్ట్
బీహార్‌లోని చాప్రా జిల్లాలో తిలక్ వేడుక సందర్భంగా నాటకీయ వాతావరణం నెలకుంది. అప్పటివరకు సందడిగా ఆ జరుగుతున్న ఆ పెళ్లి వేడుకకి.. ఓ అమ్మాయి రావడంతో.. హై టెన్షన్ నెలకుంది. ఈ డ్రామా ఫంక్షన్‌లో చాలా సేపు కొనసాగింది. ఆ యువతి వరుడి చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో అందరూ అవాక్కయారు.

వివాహ వేదికపై వరుడు చాలా సంతోషంగా ఉన్నాడు. కెమెరామెన్‌కు చాలా హ్యాపీగా ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. బంధుమిత్రులంతా ఆనందంతో వివాహ తంతును వీక్షిస్తున్నారు. ఇంతలో ఊహించని సీన్ జరిగింది. ఒక్కసారిగా ఓ మహిళ పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడి చొక్కా పట్టుకుంది. ఊహించని పరిణామానికి వరుడు షాకయ్యాడు. ఆమె అతడి మాజీ ప్రియురాలు. ఆమె వరుడి చొక్కాపట్టుకొని నిలదీస్తోంది. పెళ్లిమండపంలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వివాహ కార్యక్రమంలో సూటు, బూటు వేసుకొని పెళ్లి దుస్తులతో ఆనందంలో తేలిపోతున్నాడు వరుడు. తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ వరుడి చొక్కాపట్టుకొని ఏదో విషయమై అతడ్ని నిలదీస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులంతా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. వరుడు ఎంతగా విడిపించుకోవాలనుకున్నా ప్రియురాలు వదల్లేదు. ఇంతలో అక్కడున్న వరుడి బంధువులు ఆమెకు సర్ధిచెప్పి వేదికపైనుంచి కిందకు పంపించారు. అయినా ఆమె వరుడివైపు చేయి చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది. ఈ వీడియోలో ఇంతవరకే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. లక్షలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమెను చూసి భయపడుతున్నాడంటే వరుడిదే తప్పు అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే టీవీ9 తెలుగు ఈ వైరల్ వీడియోను నిర్ధారించడం లేదు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
