Viral News: ఈ అమ్మాయికి వరుడు కావాలట.. ఎత్తు ఎంతైనా పర్లేదు..! అసలు విషయం తెలిస్తే..
ఎందుకంటే ఆమె ఎత్తుకు సరిపడా బాయ్‌ఫ్రెండ్ దొరకడం కష్టంగా మారిందట. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చూసిన వారంతా తన కొడుకు అనుకుని తప్పుగా భావించేవారట. అది ఆమెను ఇబ్బంది పెట్టిందంటూ ఆమె ఇటీవల తన బాధను ఇంటర్‌నెట్ ద్వారా షేర్ చేశారు.

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా తాము పొడవుగా ఉండాలని కోరుకుంటారు. పొట్టిగా ఉండేవారు తరరచూ బాధపడతారు. కానీ, ఒక అమ్మాయి తాను పొడవుగా ఉన్నందుకు బాధపడుతుంది. అవును.. అదేంటనీ మీరు ఆశ్చర్యపోతున్నారా..? ఎందుకంటే ఆమె ఎత్తుకు సరిపడా బాయ్‌ఫ్రెండ్ దొరకడం కష్టంగా మారిందట. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చూసిన వారంతా తన కొడుకు అనుకుని తప్పుగా భావించేవారట. అది ఆమెను ఇబ్బంది పెట్టిందంటూ ఆమె ఇటీవల తన బాధను ఇంటర్‌నెట్ ద్వారా షేర్ చేశారు.
డైలీ స్టార్ ప్రకారం, 27 ఏళ్ల లండన్ మోడల్ కేటీ వూల్స్ ప్రస్తుతం తన అసాధారణ ఎత్తుతో వార్తల్లో నిలిచారు. 6 అడుగుల 9 అంగుళాల పొడవు ఉన్న కేటీ తన ఎత్తు ప్రేమను పొందడంలో ప్రధాన అడ్డంకిగా మారిందని చెబుతుంది. సోషల్ మీడియాలో ‘@tallgirlkatie’ అని పిలువబడే కేటీకి పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ, ఆమె గత రెండున్నర సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటోంది. తన ఎత్తు చాలా మంది పురుషులను భయపెట్టేదిగా మారింది అంటూ కేటీ వివరిస్తుంది. సిద్ధాంతంలో వారు పొడవైన అమ్మాయిలను ఇష్టపడతారని అందరూ చెబుతారు. కానీ, నేను వారి కంటే పూర్తి అడుగు ఎత్తు ఉన్నానని ఎవరైనా గ్రహించినప్పుడు, వారికి సమస్యలు మొదలవుతాయి అని ఆమె చెప్పింది.
కానీ, తనకు గతంలో కొన్ని సంఘటనలు దారుణంగా మారాయని కేటీ చెప్పింది. గతంలో తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చూసిన వారంతా తన కొడుకు అనుకునేవారని చెప్పింది. అతను నా కొడుకులా ఉన్నాడని చాలా మంది చెప్పేవారంటూ వాపోయింది. ఇది తనను చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పింది. చివరకు మేమిద్దరం విడిపోయామంటూ కేటీ వివరించింది.
అకాలంగా జన్మించిన కేటీ చిన్నప్పటి నుండే వేగంగా పెరగడం ప్రారంభించింది. ఆమె తన అన్నయ్య కంటే పొడవుగా పెరిగింది. దాంతో అందరూ తననే అక్కగా భావించేవారట. కానీ, ఇప్పుడు కేటీ తనకు సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తోంది. డేటింగ్ యాప్‌లతో విసిగిపోయానని చెప్పింది. వారాంతాల్లో క్లబ్‌లకు వెళ్లే బదులు ఇంట్లో ఆటలు ఆడటానికి ఇష్టపడే సాధారణ వ్యక్తి తనకు కావాలని కోరుకుంటోంది. అతను తన పట్ల దయతో ఉండాలని, తనను ప్రేమిస్తూ, ఎప్పుడూ తనను సంతోషపెట్టేవాడిగా, నమ్మకంగా ఉండాలని తాను కోరుకుంటోంది. ఇక అతని ఎత్తు తనకు పట్టింపు లేదని చెప్పింది.




