
Girl Broke Bike Kick Rod: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ అమ్మాయికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకోవడంతోపాటు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా అమ్మాయిలు, మహిళల డ్రైవింగ్ గురించి తరచుగా పలు రకాల చర్చలు జరుగుతాయి. అయితే.. మహిళలకు డ్రైవింగ్ చేయడం సరిగా రాదంటూ కొందరు ఎగతాళి చేస్తుంటారు. దీని గురించి తరచుగా సోషల్ మీడియా (Social Media) లో ఫన్నీ కామెంట్లు వైరల్ అవుతుంటాయి. అమ్మాయిలు – మహిళలు స్కూటీ డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేకులు సరిగా వేయరని.. బైక్‌ను ఆపడానికి వారి పాదాలను ఉపయోగిస్తారంటూ పేర్కొంటుంటారు. తాజాగా.. ఓ యువతికి సంబంధించిన బైక్ రైడింగ్ వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఆమె బైక్‌ను స్టార్ట్ చేయడానికి (bike kick rod) ప్రయత్నిస్తోంది.. ఈలోగా ఒక తమాషా సంఘటన జరుగుతుంది.
వైరల్ వీడియోలో.. అమ్మాయి బైక్ స్టార్ట్ చేయడానికి కిక్ కొట్టడం కనిపిస్తుంది. బైక్ స్టార్ట్ కాదు. దీంతో ఆమె కంటిన్యూగా తన్నుతూనే ఉంటుంది. అయితే ఈలోగా ఒక్కసారిగా కిక్ రాడ్డు విరిగి కిందపడిపోతుంది. ఆ అమ్మాయి వరుసగా కిక్ కొట్టిన తర్వాత కిక్ రాడ్డు కిందపడటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన చాలా ఫన్నీగా ఉంటుంది. సాధారణంగా 2-4 సార్లు తన్నినంత మాత్రనా.. కిక్ రాడ్డు విరిగిపోయేంత బలహీనంగా ఉండదు. కానీ ఈ అమ్మాయి తన్నుడికి కిక్ రాడ్డే విరిగిపోయిందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనను ఇంతవరకు చూడలేదంటూ పేర్కొంటున్నారు.
వైరల్ వీడియో..
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో comedynation.teb యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 65 వేలకు పైగా వీక్షించగా.. 3500 మంది లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు.
Also Read: