Google Maps: వామ్మో 30 మీటర్ల భారీ పాము.. ఏకంగా గూగుల్ మ్యాప్‌లో దర్శనం.. షాక్ అవుతున్న జనాలు..!

Google Maps: గూగుల్ మ్యాప్‌లో ప్రదేశాలు, ప్రాంతాలు, ఇతర అవసరమైన మ్యాపింగ్ సమాచారం కోసం వెదుకుతుంటాం.

Google Maps: వామ్మో 30 మీటర్ల భారీ పాము.. ఏకంగా గూగుల్ మ్యాప్‌లో దర్శనం.. షాక్ అవుతున్న జనాలు..!
Snake

Updated on: Mar 31, 2022 | 7:00 AM

Google Maps: గూగుల్ మ్యాప్‌లో ప్రదేశాలు, ప్రాంతాలు, ఇతర అవసరమైన మ్యాపింగ్ సమాచారం కోసం వెదుకుతుంటాం. గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే కొండ పర్వతాలు, నదులు, సముద్రాలు, ఆయా దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు కనిపిస్తాయి. అయితే, వీటితో పాటు భయంకరమైన ఓ ఆకారం కూడా గూగుల్ మ్యాప్స్‌లో దర్శనిమిస్తోంది. అది చూసి జనాలు హడలిపోతున్నారు. ఏంటి? ఇది నిజమేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అవును.. అందులో 30 మీటర్ల పొడవైన పాముకు సంబంధించిన అస్తిపంజరం సముద్ర తీరంలో ఉన్నట్లు కనిపించింది. అది చూసిన జనాలు అవాక్కయ్యారు. ఇంత పెద్ద పాము సాధ్యమేనా అంటూ నోరెళ్లబెడుతున్నారు. @googlemapsfun పేరుతో ఉన్న TikTok అకౌంట్‌లో గూగుల్ మ్యాప్స్‌ని సెర్చ్ చేస్తున్నప్పుడు కనిపెట్టిన ఈ ఆశ్చర్యకర దృశ్యానికి సంబంధించి వీడియోను షేర్ చేశారు. ఇది ఫ్రాన్స్ తీరంలో భారీ పాము ఉందంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతరించిపోయిన టైటానోబోవాది కావొచ్చని పేర్కొన్నారు. మునుపెన్నడూ ఇంత భారీ పాము అస్థిపంజరాన్ని చూడలేదంటూ షాక్ అవుతున్నారు. ఏకంగా గూగుల్ మ్యాప్‌లోనే కనిపించే అంత పెద్ద పాములు భూమిపై ఉండేవా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

వాస్తవం ఏంటంటే..
అయితే, ఈ వైరల్‌ వీడియోలో ఉన్న పాము అస్థిపంజరం నిజమైనదేనా? అని కొందరు పరిశోధన జరుపగా.. అసలు వాస్తవం తెలిసింది. ఇది ‘లే సర్పెంట్ డి ఓషన్’ అని పిలవబడే పెద్ద లోహ శిల్పంగా తేల్చారు. ఫ్రాన్స్‌లోని పశ్చిమ తీరంలో 425 అడుగుల ఎత్తు, 30 మీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. ఎస్తైర్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా లే సర్పెంట్ డిఓషన్ ను 2012లో ఆవిష్కరించారు. దీనిని చైనీస్-ఫ్రెంచ్ కళాకారుడు హువాంగ్ యోంగ్ పింగ్ రూపొందించారు.

Also read:

Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!

Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!