
ప్రకృతిలో జంతువులు, పక్షుల జీవన విధానం ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ముఖ్యంగా వేటాడే సమయంలో అవి చూపే చాకచక్యం వైల్డ్‌లైఫ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఒక పర్పుల్ హెరాన్ (కొంగ జాతికి చెందిన పక్షి) బతికున్న ఒక పాముతో ఆడుకుంటూ, ఆ తర్వాత దానిని ఆహారంగా మార్చుకున్న అరుదైన సీన్ కెమెరాకు చిక్కింది.
సాధారణంగా కొంగలు నీటిలో ఉండే చేపలు, కప్పలను వేటాడటం మనం చూస్తుంటాం. కానీ ఈ పర్పుల్ హెరాన్ మాత్రం ఏకంగా ఒక చిన్న పామును వేటాడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పామును పట్టుకున్న వెంటనే మింగేయకుండా, దాంతో కాసేపు ఆటలాడింది. తన పొడవైన ముక్కుతో ఆ పామును గాల్లోకి ఎగరేస్తూ, మళ్లీ చాకచక్యంగా నోటితో పట్టుకుంటూ టాసింగ్ చేసింది.
వీడియోలో చూసినట్లుగా.. కొంగ గాల్లోకి విసిరినప్పుడు ఆ పాము ప్రాణభయంతో మెలికలు తిరుగుతూ కిందపడబోయింది. కానీ అంతే వేగంతో ఆ కొంగ తన ముక్కుతో దాన్ని పట్టుకుని, నోట్లోకి నమిలి మింగేసింది. పక్షులు కొన్నిసార్లు తమ ఆహారాన్ని సరిగ్గా మింగడానికి లేదా చంపడానికి ఇలా గాల్లోకి ఎగరేసి ఆడుకుంటాయని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు చెబుతుంటారు.
The tossing by purple heron అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. “ఇలాంటి అద్భుతమైన దృశ్యం లైఫ్‌లో ఒక్కసారే చూడగలం, ప్రకృతిలో వేట ఎంత క్రూరంగా ఉంటుందో ఈ వీడియోనే సాక్ష్యం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.