ముగ్గురు టూరిస్టులకు నీటి ఏనుగులు చుక్కలు చూపించాయి. బోటులో ప్రయాణిస్తున్న వాళ్లను కాసేపు హడలెత్తించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బోటుతో సమానంగా.. వారిని వెంబడించాయి. బ్రతుకు జీవుడా.! అనుకుంటూ ఆ ముగ్గురు టూరిస్టులు ప్రాణాలతో బయటపడ్డారు. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. అందులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. వాటి కంట కనబడితే ఇక అంతే సంగతులు. ఈ విషయాన్ని తెలిసి కూడా కొందరు టూరిస్టులు అందులో స్పీడ్ బోటింగ్‌కు వెళ్లారు. సరస్సులో ఉన్న నీటి ఏనుగులను ఫోటోలు, వీడియోలు తీస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక అదే సమయంలో ఓ నీటి ఏనుగు గట్టిగా అరుస్తూ బోటు వద్దకు చేరుకోబోయింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన బోటు డ్రైవర్.. రయ్ మంటూ స్పీడ్ పెంచడంతో త్రుటిలో తప్పించుకోగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను బోటు ఉన్న ఓ టూరిస్టు రికార్డు చేశాడు. స్పీడ్‌గా వెళ్తూ అది వచ్చేస్తోందంటూ.. అరుపులు కేకలు పెడుతూ… అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఆ టూరిస్ట్ తీసిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాల్కానీలో దంపతుల ఫైట్.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!