Viral Video: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఏంటని చూడగా..

|

Mar 02, 2023 | 1:50 PM

పాములను దూరం నుంచి చూస్తే చాలు ఠక్కున పరుగులు పెడతారు. అదే దగ్గరకి వస్తే.. ఇంకేమైనా ఉందా..

Viral Video: కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఏంటని చూడగా..
Viral Video
Follow us on

పాములను దూరం నుంచి చూస్తే చాలు ఠక్కున పరుగులు పెడతారు. అదే దగ్గరకి వస్తే.. ఇంకేమైనా ఉందా.. గుండె జారి గల్లంతయినట్లే. ఇంటర్నెట్‌లోనూ పాములకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. తాజాగా అదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు ఇంజిన్‌లో చుట్టుకుని ఉన్న ఓ భారీ నాగుపాముకు చెందిన వీడియోను చూసి నెటిజన్ల మైండ్ బ్లాంక్ అవుతోంది. దాదాపుగా 9 అడుగులు పొడవున్న ఆ నాగుపాము ఎంచక్కా చుట్టుకుని ఇంజిన్‌లో సేద తీరుతోంది. అక్కడున్న స్థానికులు దీన్ని గమనించడంతో.. గంటన్నర కష్టపడి.. ఆ పామును అక్కడి నుంచి బయటికి తీశారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సాంగ్‌ఖ్లా ప్రావిన్స్‌‌లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేసుకోండి..