Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ గురుడికి ఆత్రం ఆగలేదు.. అమ్మాయిలతో స్టంట్‌.. సీన్‌ కట్‌చేస్తే ఫ్యూజులు ఔట్‌.. వీడియో వైరల్‌

Sport Biker Stunt with Girls: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే..

Viral Video: ఈ గురుడికి ఆత్రం ఆగలేదు.. అమ్మాయిలతో స్టంట్‌.. సీన్‌ కట్‌చేస్తే ఫ్యూజులు ఔట్‌.. వీడియో వైరల్‌
Sport Biker Stunt With Girl
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2021 | 5:59 PM

Sport Biker Stunt with Girls: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. కొంతమంది బైక్‌లపై స్టంట్లు చేస్తూ అలరిస్తుంటారు. జీవితం ప్రమాదంలో పడుతుందని తెలిసినా.. ప్రెస్టైజ్‌కి వెళ్లి నవ్వుల పాలవుతుంటారు. అలాంటిదే.. ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్‌తో అమ్మాయిలతో చేసిన రైడింగ్‌ కాస్త.. నవ్వులు తెప్పిస్తుంది. చివరకు ప్రమాదంలో పడిన తీరుపై అందరూ నవ్వుకోవడంతోపాటు.. పలు కామెంట్లు కూడా చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చాలా మంది వ్యక్తులు తమ స్పోర్ట్స్ బైక్‌లతో ఒకే చోట నిల్చొని ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఆ తర్వాత అక్కడ రేస్ జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ బైకర్‌.. అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతుంది. బైక్‌పై యువతులిద్దరూ ముందు, వెనుక కూర్చొంటారు. బైకర్‌కు ఒక్కసారిగా జోష్‌ వస్తుంది. ఆ తర్వాత బైకర్‌ విన్యాసాలు చూపించడానికి బదులు బొక్కబోర్లాపడతాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

వైరల్‌ వీడియో..

బైక్‌పై అమ్మాయిలు కూర్చోగానే బైకర్‌ విన్యాసాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఆ వ్యక్తి బైక్ రేసును పెంచిన వెంటనే.. బైక్ అదుపు తప్పి ముందు పార్క్‌ చేసిన బైక్‌ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బైకర్‌తోపాటు.. అమ్మాయిలిద్దరూ కూడా సమీపంలో పార్క్ చేసిన ఇతర బైక్‌లపై పడిపోయారు. అయితే.. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. దీంతోపాటు పలు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో డార్విన్ అవార్డ్స్ పేరుతో ఒక పేజీ షేర్ చేసింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడి తీసిందనేది తెలియరాలేదు.

Also Read:

Heart Attack: ఈ లక్షణాలుంటే గుండెపోటుకు దారి తీస్తున్నట్లే.. అస్సలు అజాగ్రత్తగా ఉండకండి..

Cheetah Hulchul: షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత టెర్రర్.. ఊరు మొత్తం అతలాకుతలం

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!