Viral Video: అడవి రాజు ఎవరు అంటే టక్కున సింహం అని చెబుతాం. వాస్తవానికి బరువులో ఏనుగు పెద్ద అయినా.. ఎత్తులో జీరాఫీ టాప్ అయినా.. సింహం శక్తి ముందు ఈ రెండూ బలాదూరే. అందుకే సింహాన్ని అడవికి రాజు, మృగరాజు అంటారు. దాని అలజడి వింటేనే అడవిలోని మిగతా జంతువులు ప్రాణ భయంతో పరుగులు తీస్తాయి. సింహం గర్జన వింటేనే అడవి మొత్తం వణికిపోతోంది. అయితే, ఏ యుద్ధంలోనైనా గెలవాలంటే బలం కాదు.. ధైర్యం ఉండాలని అంటుంటారు. ఈ నానుడి ఓ గ్రామ సింహానికి అంటే శునకానికి సరిగ్గా సరిపోలుతుంది. దీనికి ధైర్యం పీక్స్‌లో ఉండటం వల్లనో ఏమో గానీ.. ఏకంగా రెండు సింహాలకు సస్సు పోయించింది ఓ కుక్క. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అడవిలోని మైదాన ప్రాంతంలో ఆడ సింహం, మగ సింహం ప్రశాంతంగా పడుకుని సేద తీరుతున్నాయి. ఆ పక్కనే జీబ్రాల గుంపు గడ్డి మేస్తుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. ఓ కుక్క నేరుగా సింహాల వద్దకు వచ్చింది. వాటి ముందు నిల్చుని గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. దెబ్బకు సింహాలు జడుసుకుని పైకి లేస్తాయి. కుక్కపై దాడి చేసేందుకు సింహాలు ప్రయత్నించగా.. ఆ కుక్క మరింత రెచ్చిపోయి రివర్స్ అటాక్ చేసింది. వాటిని ఎగిరి ఎగిరి మరీ తన్నింది. కుక్క అరుపులకు సింహాలు రెండూ బెదిరిపోయాయి. ఒకానొక దశలో వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన కుక్క.. మళ్లీ వచ్చి సింహాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. కుక్క ఇచ్చిన ఝలక్‌కు బిత్తరపోయిన సింహాలు.. అక్కడి నుంచి పరుగులు తీశాయి. ఈ వీడియో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. కుక్క ధైర్యాన్ని, అది చేసిన రౌడీయిజాన్ని చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
The injured dog takes on the mighty lion couple.Courage can take you to try & achieve the impossible…
(VC:SM) pic.twitter.com/9H0zOxO2HL— Susanta Nanda IFS (@susantananda3) April 10, 2022
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!
Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..