Viral Video – Cat vs Rat: టామ్ అండ్ జెర్రీ గురించి తెలియని వారు ఈ దునియాలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఫేమస్ అయ్యింది ఆ కార్టూన్ ప్రోగ్రామ్. చిన్న పిల్లలు అది చూస్తే గానీ ముద్ద నోట్లోకి పోనివ్వరు. అంతలా ఆకట్టుకుంటుంది కార్టూన్ రూపంలో ఉన్న పిల్లి, ఎలుక పోట్లాట. సహజంగానే పిల్లి, ఎలుకకు అస్సలు పడదు. పిల్లికి ఎలుక దొరికిందంటే.. ఇక ఆహారమైనట్లే. అయితే, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ సిరీస్‌లో మాత్రం ఆ రెండూ నిత్యం కొట్టుకుంటూనే స్నేహంగా ఉన్నట్లు చూపడం అద్భుతంగా ఉంటుంది. కానీ, రియాలిటీకి వచ్చే సరికి పరిస్థితి అలా ఎంతమాత్రం ఉండదు. పొరపాటున పిల్లికి ఎలుక దొరికితే.. అదే దాని చివరి రోజు అని చెప్పాలి. అందుకే.. పిల్లికి ఏమాత్రం చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుంటుంది ఎలుక. అయితే, తాజాగా ఓ పిల్లి, ఎలుకకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎలుక ఓ పిల్లను వీపీ ని చేసి ఆడేసుకుంది. అది చూసి నెటిజన్లు ఓ రేంజ్‌ల్ నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఎలుక తెలివి తేటలకు ఫిదా అయిపోతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఓ పిల్ల కంట ఎలుక పడింది. దాంతో ఎలాగైనా ఆ ఎలుకను ఆరగించాలని పిల్లి తెగ ప్రయత్నించింది. మరోవైపు పిల్లి బారినుంచి తప్పించుకునేందుకు ఎలుక నానా తంటాలు పడింది. చివరికి ఓ లారీ టైర్‌లో ఐరన్ వీల్ మధ్య నక్కింది. అది గమనించని పిల్లి ఎలుకను పక్కనే పెట్టుకని టైర్ చుట్టూ రౌండ్స్ కొట్టింది. ఎలుక కోసం పిచ్చిదానిలా వెతికింది. కళ్ల ముందే ఎలుక ఉన్నా కనిపెట్టలేకపోయింది. కానీ ఆ ఎలుక మాత్రం పిల్లిని గమనిస్తూనే ఉంది. చివరికి పిల్లి.. ఎలుకను పట్టుకోలేకపోయింది. అయితే, దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. ‘ఎలుక రాక్స్.. పిల్లి షాక్స్..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కదా నిజమైన టామ్ అండ్ జెర్రీ ఇవే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 60 వేల వ్యూస్ రాగా.. వేలాది లైక్స్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Viral Video:
Admit it…you also didn’t see it. pic.twitter.com/pubk3K6dGc
— Dr. Ajayita (@DoctorAjayita) September 27, 2021
Also read:
Attack: ఆ ఇద్దరు మాట్లాడుకుంటుండగా చూశారు.. చెట్టకు కట్టేసి..
Sushmita Konidela Photos: సోషల్ మీడియాలో సుస్మిత కొణిదల ఫొటోస్… వావ్ అంటున్న ఫ్యాన్స్..
LIC: రోజుకు రూ.11 కట్టండి.. రూ. 5.5 లక్షలు పొందండి.. ఈ ఎల్‌ఐసీ పాలసీతో ఎంత లాభమో తెలుసుకోండి..