4 నిమిషాల్లో 51మంది మిమిక్రీ..మీరు చూడాల్సిందే..!

టాలెంట్ ఎవరి సొత్తు కాదు. సరిగ్గా దృష్టి పెడితే మిరాకిల్స్ చెయ్యెచ్చు. అలానే మిమిక్రితో కేరళకు చెందిన ఓ యువతి మెస్మరైజ్ చేస్తోంది.  మిమిక్రీలో మెగాస్టార్, సూపర్ స్టార్ లాంటి బిరుదులు ఏమైనా ఉంటే ఆమెకు ఎంచక్కా ఇచ్చేయెచ్చు. ఇందులో ఏ మాత్రం అతశయోక్తి లేదు. సెకన్..సెకన్‌కి ఆమె వాయిస్ మార్చేస్తుంది. ఇండియాలో ఏ సెలబ్రిటీని అయినా ఇట్టే ఇమిటేట్ చేస్తోంది.  కేవలం 4 నిమిషాల సమయంలో 51మంది వాయిస్‌లను ఇమిటేట్ చేసిన ఆమె కళకు ఇంటర్నెట్ […]

4 నిమిషాల్లో 51మంది మిమిక్రీ..మీరు చూడాల్సిందే..!

Updated on: Jan 02, 2020 | 10:14 PM

టాలెంట్ ఎవరి సొత్తు కాదు. సరిగ్గా దృష్టి పెడితే మిరాకిల్స్ చెయ్యెచ్చు. అలానే మిమిక్రితో కేరళకు చెందిన ఓ యువతి మెస్మరైజ్ చేస్తోంది.  మిమిక్రీలో మెగాస్టార్, సూపర్ స్టార్ లాంటి బిరుదులు ఏమైనా ఉంటే ఆమెకు ఎంచక్కా ఇచ్చేయెచ్చు. ఇందులో ఏ మాత్రం అతశయోక్తి లేదు. సెకన్..సెకన్‌కి ఆమె వాయిస్ మార్చేస్తుంది. ఇండియాలో ఏ సెలబ్రిటీని అయినా ఇట్టే ఇమిటేట్ చేస్తోంది.  కేవలం 4 నిమిషాల సమయంలో 51మంది వాయిస్‌లను ఇమిటేట్ చేసిన ఆమె కళకు ఇంటర్నెట్ మొత్తం ఇంప్రెస్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే..కేరళలోని నేదుమంగాడ్‌కు చెందిన అఖిలా అనే  యువతి ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్కూల్ నుంచే మిమిక్రీపై ఇంట్రస్ట్ పెంచుకోన్న అఖిల మొదట వివిధ రకాల జంతువుల వాయిస్‌లను ఇమిటేట్ చేయడం ప్రారంభించింది. అలా స్కూల్ దశలోనే పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా పలు టీవీ షోలలో సత్తా చాటింది. షారుక్ ఖాన్, కమల్‌, రజనీ, ఎస్ జానకీ లాంటి ఎంతోమంది గాత్రాలు ఆమె గొంతు నుంచి విని తీరాల్సిందే.