Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక వైరల్ ఫ్రెంచ్ డ్యాన్సర్ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్, ఆగ్రాలోని తాజ్ మహల్ రెండు ప్రపంచ స్మారక చిహ్నాల ముందు పాటకు డ్యాన్స్ చేయడం ద్వారా భారతదేశానికి నివాళి అర్పించింది. టిప్ టిప్ బర్సా పానీ 2, కచా బాదంలో తన డ్యాన్స్ రీల్స్ తర్వాత వైరల్ అయిన ఫ్రాన్స్‌కు చెందిన డ్యాన్సర్ జికా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. చాలా మంది దేశీ నెటిజన్లు ఇష్టపడే తన వీడియోలలో అతను తరచుగా భారతీయ పాటలకు గ్రూవ్ చేస్తూ కనిపిస్తాడు. తక్కువ వ్యవధిలో, ‘జికామను’ 556k ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
జికా ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ప్రదేశాల నుండి భారతదేశానికి ట్రావెల్ చేస్తున్నప్పుడు దేశీ పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపించిన అనేక రీల్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవ వీడియోలో జికా తన స్నేహితుడు హృతిక్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఈఫిల్ టవర్ నుండి తాజ్ మహల్‌కు మారడం హోలీ రంగుల ఎఫెక్ట్ తో చాలా కూల్‌గా కనిపించింది.
వారి డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో అభిమానుల్ని పిచ్చెక్కించారు..ఈ వీడియో 226k వ్యూస్, 21k లైక్‌లతో వైరల్‌గా మారింది.
ఇద్దరు డ్యాన్సర్లు పారిస్‌లోని ఆర్క్ డి ట్రయంఫే, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ ముందు ఉన్న ఒకే విధమైన స్టెప్పులతో వీడియోలో గ్రూవ్‌గా కనిపించారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి..
పారిస్‌లో, న్యూఢిల్లీలోని లోటస్ టెంపుల్ ముందు వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లు మరో వీడియో షేర్ చేశారు.. ఇక్కడ రీల్ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి