
ఏనుగు ఎదురొస్తే ఆమడదూరం పరుగెత్తాల్సిందే..! గజరాజు.. పేరు వింటేనే హడల్.. అలాంటి ఏనుగు రోడ్డుకు అడ్డంగా తిష్ఠ వేస్తే.. పైపైకి దూసుకొస్తుంటే.. ఊహించేందుకే కష్టంగా ఉంది కదూ..! అచ్చం ఇలాంటి సీనే చోటు చేసుకుంది ఉత్తరాఖండ్‌లో.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పైకి వెళ్లింది గజరాజు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మాజీ సీఎం వెళ్తున్న కాన్వాయ్‌పైకి దూసుకొచ్చింది ఏనుగు. ఎంతకూ వెనక్కి వెళ్లకపోవడంతో కాన్వాయ్ దిగిన త్రివేంద్ర.. చెట్లు, గుట్టలు ఎక్కాల్సి వచ్చింది. గుట్టలెక్కినా మాజీ సీఎం వెంటపడింది ఏనుగు. చివరకు ఎలాగోలా ఏనుగు బారి నుంచి తప్పించుకున్నారు త్రివేంద్ర. ఆయన వెంట ఉన్న వారంతా కారు దిగి గుట్టలపైకి పరుగులు తీశారు. ఏనుగు దగ్గరికి రాగానే మాజీ సీఎం సహా సిబ్బంది తమ వాహనం వదిలి కొండ ఎక్కాల్సి వచ్చింది. అతను ఒక కొండపైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్ పౌరి నుంచి సత్పులి మీదుగా కోట్‌ద్వార్‌కు వెళ్తున్నారు. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య అకస్మాత్తుగా ఓ ఏనుగు అడవి నుంచి బయటకు వచ్చింది. కోటద్వార్-దుగడ్డ మధ్య ఉన్న తుట్ గదేరా సమీపంలో రోడ్డుపైకి భైటాయించింది.
దీంతో మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ సుమారు అరగంట సేపు నిలిచిపోయింది. కాసేపటికి మాజీ సీఎం తన వాహనంలో కూర్చున్నా కొంతసేపటికి ఏనుగు ఆయన వాహనం వైపు వచ్చింది. తన వాహనం వద్దకు ఏనుగు రావడం చూసిన మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. ఆయన సహచరులు వాహనం వదిలి కొండలపైకి వెళ్లిపోయారు. ఈ సమయంలో సీఎం ప్రధాన అనుచరుడికి కింద పడిపోయాడు. ఏనుగు అతనిపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది.
సుమారు అరగంటపాటు శ్రమించిన అటవీ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. మాజీ సీఎం హైవే గుండా వెళ్లడంతో అటవీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండిగ్ న్యూస్ కోసం