పంచ్ కొడతా.. .తడాఖా చూపుతా…!

|

Jul 31, 2019 | 3:59 PM

‘ మార్షల్ ఆర్ట్స్ లో నేనూ సై …. చూపుతా నా తడాఖా ‘ అంటోందా పిల్ల ఎలుగుబంటి. ఆ ‘ కుంగ్ ఫు బేర్ ‘ ని చూసిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఓ రెండు మూడు నిముషాలసేపు ‘ బేర్ మన్నాడు ‘. అది.. తూర్పు రష్యా సమీపంలోని ‘ సఖాలిన్ ‘ దీవి. జపాన్ దేశానికి కూడా ఈ దీవి దగ్గరే.. సాధారణంగా ఈ దీవిలో ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. ఊదా రంగుతో […]

పంచ్ కొడతా.. .తడాఖా చూపుతా...!
Follow us on

‘ మార్షల్ ఆర్ట్స్ లో నేనూ సై …. చూపుతా నా తడాఖా ‘ అంటోందా పిల్ల ఎలుగుబంటి. ఆ ‘ కుంగ్ ఫు బేర్ ‘ ని చూసిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఓ రెండు మూడు నిముషాలసేపు ‘ బేర్ మన్నాడు ‘. అది.. తూర్పు రష్యా సమీపంలోని ‘ సఖాలిన్ ‘ దీవి. జపాన్ దేశానికి కూడా ఈ దీవి దగ్గరే.. సాధారణంగా ఈ దీవిలో ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. ఊదా రంగుతో ఉండే వీటికి మనుషులంటే భయం లేనట్టు ఉంది. ఈ మధ్య ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుండగా.. ఎదురుపడిన ఈ పిల్ల ఎలుగు.. అతడ్ని చూసి.. తన వెనుక కాళ్లపై నిలబడి.. ముందు కాళ్లతో మనిషిలాగే ‘ పంచ్ ‘ లు కొడతానంటూ ‘ బెదిరించింది ‘. కొద్ది దూరం వెనక్కి వెళ్లి.. మళ్ళీ తిరిగి వఛ్చి అదే టైపులో బెదిరించి నిష్క్రమించింది. ట్రాక్టర్ డ్రైవర్ దాని గాలి పంచ్ లు చూస్తూ నవ్వుతూ ..తన ట్రాక్టర్ ను నడుపుకుని వెళ్ళిపోయాడు. కాస్త దూరంలోనే ఉన్న రెండు ఎలుగుబంట్లు మాత్రం తమ ‘ ధ్యాస ‘ లో తాము ఉండిపోయాయి. పిల్ల ఎలుగు ‘ పోరాటం ‘ తాలూకు వీడియో బయటికొఛ్చి వైరల్ అవుతోంది. అన్నట్టు రష్యా తో బాటు జపాన్ లోనూ కుంగ్ ఫు, మార్షల్ ఆర్ట్స్ బాగా పాపులర్ ఫైట్స్.. ఎవరో సరదాగా ఈ మార్షల్ ఫైట్స్ చేస్తున్నప్పుడు ఈ పిల్ల ఎలుగు చూసినట్టుంది. ఈ డ్రైవర్ కనబడగానే అది గుర్తుకొచ్చి ..ఇలా తమాషా సీన్ సృష్టించింది.