
నెమళ్ళు పురి విప్పి నాట్యం చేయడం కొత్తేమీ కాదు. మేఘాలు కమ్మేసిన వేళ వర్షం సూచన ఇవ్వగానే నెమళ్లు పురి విప్పి నృత్యం చేయటం ప్రారంభిస్తాయి. కానీ, ఆకాశంలోకి ఎగురుతూ వెళ్లే అందమైన నెమలిని మీరేప్పుడైనా చూశారా..? కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నాట్యమయూరి గాల్లో ఎగురుతూ వెళ్తున్న వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. నమ్మడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇప్పుడు చూద్దాం…
నెమలి అందాన్ని వర్ణించడానికి పదాలు సరిపోకపోవచ్చు. నెమలి రూపం, దాని నాట్యం చూసేందుకు అందంలో సాటిలేనివి. కొన్నిసార్లు ప్రకృతిలో వింతలు జరుగుతాయి. ఆ వింతలలో ఒకటి ఈ నెమలి ఆకాశంలో ఎగురుతుంది. ఇలా ఎగురుతున్న నెమలి వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో, ప్రతిచోటా వైరల్ అవుతోంది.
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో, రెండు నెమళ్ళు రోడ్డు మధ్యలో ఆహారం ఎరుకుతింటున్నాయి. కానీ అకస్మాత్తుగా, ఒక నెమలికి ఒక ఆలోచన వచ్చింది ? అది పూర్తిగా నేల నుండి దూకింది. అమాంతంగా పైకి ఎగురుతూ ప్రయాణించాలని. అంతే ఆ అందమైన నెమలి హాయిగా గాల్లోకి ఎగురుతూ చెట్టుపైకి ఎక్కి కూర్చుకుంది.
వీడియో ఇక్కడ చూడండి..
Majestic Flight. 🌳🦚😍pic.twitter.com/7dAHcV19P1
— Cosmic Gaia (@CosmicGaiaX) September 22, 2022
నెమలి ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @CosmicGaiaX అనే ఖాతా షేర్ చేసింది. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. అందమైన కామెంట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..