Student Teacher Dance Viral In Classroom: ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ వైరలవుతుంటాయి. ఇక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియోలైతే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షల మంది చూశారు.
టీచర్,స్టూడెంట్ మధ్య ఈ సంబంధం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొంటుంటారు. ఈ వీడియోలో, పిల్లవాడు తన గురువుతోపాటు స్టెప్పులు దంచేస్తున్నాడు. ఈ వీడియో చూస్తే క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎవరూ అనలేరు. ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది.
Our 8th grade Stingrays having a well deserved exam dance break. Of course our teachers are ending 2022 with a win. Love my Stingrays ?? Happy Holidays @HCPS_SumnerHS pic.twitter.com/Mps92JPJAU
— Natalie.McClain (@McClainEducates) December 23, 2022
ఈ డాన్స్ వీడియో ఫ్లోరిడాలోని సమ్మర్ హై స్కూల్ నుంచి వచ్చింది. ఈ వీడియోలో విద్యార్థులు తమ టీచర్‌ను డాన్స్ చేయమని సవాలు చేస్తూ కనిపించారు. ఆ తర్వాత టీచర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీచర్లు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. మహిళా టీచర్ చేసిన డాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో @McClainEducates ఖాతా నుంచి Twitterలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను 23 వేల మంది లైక్ చేశారు. చాలా మంది ఈ వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. ఎన్నో డాన్స్ వీడియోలు ఉన్నా.. ఈ వీడియో మాత్రం ఎంతో స్పెషల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..