బిడ్డను బీచ్‌లో వదిలేసినందుకు తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష..! అసలు విషయం ఏంటంటే..
ఏడాది వయసున్న బిడ్డను బీచ్‌లో వదిలేసినందుకు ఆ తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. 38 ఏళ్ల షమీకా మిచెల్ అనే మహిళకు పిల్లలపై హింస, బిడ్డను వదిలేయటం వంటి నేరాల కింద కోర్టు శిక్ష విధించబడింది. పెద్ద కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ బిడ్డను రక్షించారు. కాగా, ఆ తల్లి అప్పటికీ తప్పతాగి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని మిచిగాన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్లోరిడాలోని మిచిగాన్‌కు చెందిన 38ఏళ్ల షమీకా మిచెల్ అనే మహిళ బిడ్డతో బయటకు వెళ్లింది. కానీ, తిరిగి వచ్చినపుడు మిచెల్ బిడ్డ లేకుండా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె పెద్ద కొడుకు తల్లిని అనుమానించాడు. తమ్ముడి గురించి ఆరా తీయగా, తల్లి పొంతనలేని సమాధానం చెప్పింది. దాంతో అనుమానం మరింత బలపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన తమ్ముడి గురించి అడిగినప్పుడు తాను తమ్ముడు తన తండ్రితో ఉన్నాడని చెప్పింది మిచెల్. కానీ పెద్ద కొడుకు తల్లి మాట నమ్మలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన తల్లి వివిధ మానసిక పరిస్థితులను ఎదుర్కొంటుందని, అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుందని పోలీసులకు చెప్పాడు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిడ్డ ఆచూకీ కోసం గాలించగా, ఫ్లోరిడాలోని డేటోనా బీచ్‌లో ఆచూకీ లభించింది. సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో మిచెల్ తన ఏడాది వయసున్న బిడ్డతో అర్ధరాత్రి బీచ్‌లో నడుస్తున్నట్లు కనిపించింది. కానీ, ఐదు నిమిషాల తర్వాత ఆమె అదే దారిలో బిడ్డ లేకుండా తిరిగి రావడం కనిపించింది. ఏడాది వయసున్న పసిబిడ్డను బీచ్‌లో వదిలేయడంతో పిల్లవాడు ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు ఆ బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ సంఘటన 8నవంబర్ 2023న జరిగింది.
ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత మిచెల్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో మిచెల్ గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలను వాడుతున్నట్టుగా నిర్ధారించారు. మిచెల్‌కు ఒకటి నుండి 17 సంవత్సరాల వయస్సు గల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె అరెస్టు తర్వాత ఆ పిల్లలను అనాథాశ్రమానికి పంపారు. మిచెల్‌కు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..