హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..

దీపావళి రోజు మనోజ్ ఠాకూర్ అనే వ్యక్తి, అతని మేనల్లుడు ధరమ్ సింగ్ ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే, దీని తర్వాత ధరమ్ సింగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ, మనోజ్ కుమార్ రాలేదు. తర్వాతి రోజు బబల్‌పూర్ నగర శివార్లలో ధరమ్ సింగ్ శవమై కనిపించాడు.

హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
Flies Caught The Killer

Updated on: Nov 05, 2024 | 8:44 PM

ఓ హత్యకేసులో నిందితుడిని ఈగలు పట్టించాయి. అవును మీరు విన్నది నిజమే.. స్నిప్పర్‌ డాగ్స్‌ కాదు.. ఈగలే నిందితుడిని పోలీసులకు దొరికేలా చేశాయి. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో 19 ఏళ్ల అనుమానితుడు ధరించిన దుస్తులపై ఈగలు అంటుకోవడంతో పోలీసులు హత్య కేసును ఛేదించినట్లు అధికారులు వివరాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి రోజు మనోజ్ ఠాకూర్ అనే వ్యక్తి, అతని మేనల్లుడు ధరమ్ సింగ్ ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే, దీని తర్వాత ధరమ్ సింగ్ ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ, మనోజ్ కుమార్ రాలేదు. తర్వాతి రోజు బబల్‌పూర్ నగర శివార్లలో ధరమ్ సింగ్ శవమై కనిపించాడు. చివరి సారిగా ధరమ్‌సింగ్‌ను కలిసిన వ్యక్తిగా ఠాకూర్‌ను పోలీసులు మనోజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. ఈ సమయంలోనే ఓ వింత జరిగింది.

మనోజ్‌ కుమార్‌ పోలీసులు విచారిస్తుండగా, అతను ససేమీరి అంగీకరించటం లేదు.. కానీ, అక్కడ ఈగలు అతన్ని చుట్టుముట్టాయి. పుట్టలకొద్దీ ఈగలు అతని చుట్టే తిరగడం ప్రారంభించాయి. దీంతో అతడు ధరించిన చొక్కాను పరీక్షలకు పంపగా డార్క్ కలర్ చొక్కాపై రక్తపు మరకలు బయటపడ్డాయి. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సోనాలి దూబే విలేకరులకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..