Poisonous Creatures: సమస్త జీవ కోటికి భూమి అవాసం. వెలుగులోకి రాని జీవాలు ఎన్నో ఈ భూప్రపంచంలో ఉన్నాయి. మనకు తెలిసినవి మాత్రం కొన్నే. అయితే, వీటిలో మనుషుల మధ్యే బ్రతుకుతూ.. మనుషుల ప్రాణాలకే ముప్పుగా ఉన్న జీవులు కొన్ని ఉన్నాయి. విషపూరితమైన ఈ జీవులు.. కాటేస్తే కాటికి చేరాల్సిందే. విషపూరితమైన జీవుల్లో పాములు, తేళ్లే కాకుండా.. ఇంకా చాలా జీవులు ఉన్నాయి. అయితే, ఇవాళ మనం భూమిపై ఉన్న 5 విషపూరితమైన జీవుల గురించి ఇవాళ తెలుసుకుందాం.
ఫన్నెల్ వెబ్ స్పైడర్: సాలీడును మీరు చూసే ఉంటారు. ఈ సాలీడు చెందినదే ఫన్నెల్ వెబ్ స్పైడర్. దీనిని తొలుత ఆస్ట్రేలియాలో కనిపెట్టారు. దీని విషం సైనైడ్ కంటే ప్రమాదకరం. నివేదికల ప్రకారం.. ఈ సాలీడు కాటు తర్వాత ఒక వ్యక్తి 15 నిమిషాల నుండి 3 రోజులలోపు చనిపోయే ఛాన్స్ ఉంది.
బాక్స్ జెల్లీ ఫిష్: ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అంతే ప్రమాదకరం. బాక్స్ జెల్లీ ఫిష్ ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన జీవులలో ఒకటిగా నిలిచింది. దీని విషం ఒకేసారి 60 మందిని చంపగలదు. దాని విషం మానవ శరీరంలోకి చేరిన వెంటనే, ఒక నిమిషంలో చనిపోయే ఛాన్స్ ఉంది.
ఇండియన్ రెడ్ స్కార్పియన్: తేళ్లలో అత్యంత విషపూరితమైనది. భారతదేశంలో కనిపించే దీనిని ఇండియన్ రెడ్ స్కార్పియన్ అని పిలుస్తారు. అయితే, ఇది భారతదేశంలోనే కాకుండా, దక్షిణాసియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా కనిపిస్తుంది. ఇది కాటు వేసిన తరువాత ఎలాంటి చికిత్స తీసుకోనట్లయితే.. ఆ వ్యక్తి 72 గంటల్లో ప్రాణాలు కోల్పోతారు.
నత్త: ఇది చాలా ప్రమాదకరమైన నత్త. ప్రపంచంలో 600 కంటే ఎక్కువ నత్త జాతులు ఉన్నప్పటికీ.. కోన్ నత్త అత్యంత విషపూరితమైనది. దీని బాధితులు.. పక్షవాతంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
బ్లూ రింగ్డ్ ఆక్టోపస్: ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ ఆక్టోపస్ జాతులు ఉన్నాయి. కానీ వాటిలో ‘బ్లూ రింగ్డ్ ఆక్టోపస్’ అత్యంత ప్రమాదకరమైనది, విషపూరితమైనది. ఇది హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియా సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని విషం కేవలం 30 సెకన్లలో మనిషిని అపస్మారకస్థితిలోకి నెట్టేస్తుంది. దీని విషం ఒక్కసారి 25 మందిని చంపగలదు.
Also read:
Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Poisonous Creatures: ప్రపంచంలోనే అత్యంత 5 విషపూరిత జీవులు.. కాటు వేశాయో కాటికి చేరాల్సిందే..!