First Sunrise of 2022: సూర్యోదయం అంటేనే నేచర్ బ్యూటీకి కేరాఫ్. తెల్లవారు జామున భానుడు అలా మెల మెల్లగా ఉదయిస్తుంటే.. ఆ లేలేత కాంతి కరణాలు ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ భూమిని తాకున్న క్షణంలో ఏర్పడే అద్భుత దృశ్యం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. మరి భూమి నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంటే.. అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చెప్పింది వింటేనే గూస్‌బమ్స్ వస్తుంటే.. ఆ సుందర దృశ్యాన్ని చూసిన వారి ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. అవును.. కొత్త ఏడాదిలో తొలిరోజు సూర్యోదయానికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉన్న వ్యోమగాములు జనవరి 1, 2022న సూర్యోదయం అవుతున్న సమయంలో ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి యమ స్పీడ్‌గా వైరల్ అయ్యాయి. అంతరిక్షం నుంచి తీసిన ఆ సూర్యోదయం ఫోటోలను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసి నెటిజన్లు సూపర్ గా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు న్యూఇయర్ సంబరాలు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసి న్యూఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ తర్వాత సూర్యోదయానికి సంబంధించిన ఫోటోలను తీశారు సిబ్బంది. వీరు రోజులో 16 సూర్యోదయాలను చూశారు. వాటిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ సన్‌రైస్ బ్యూటీ పిక్స్‌ని ఇప్పుడే చూసేయండి.
Happy New Year! The station crew sees 16 sunrises a day, and they officially started 2022 at 12am GMT. pic.twitter.com/ConanYAhPm
— International Space Station (@Space_Station) January 1, 2022
Also read:
పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు
COVID Drug: కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.. మరో వారంలో మీ సమీపంలోని మెడికల్ షాపుల్లోకి టాబ్లెట్స్..
Viral Video: బంగారం పూత పూసిన మిఠాయిలు.. కిలో ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎక్కడంటే..