ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారణమైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ అనే హైసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగడం చర్చనీయాంశమైంది. ఒకరిపై మరొకరు తమ చేతికి దొరికిన వస్తవులతో ఘర్షణలకు దిగడం ఆందోళ కలిగించింది. హౌసింగ్ సొసైటీలోని పార్కింగ్ వద్ద మొదటగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరో వ్యక్తి ఈ గోడవకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్నాక ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గోడవ ఆగలేదు. చివరకు పోలీసులపై కూడా నిందితులు దాడులకు పాల్పడ్డారు. చొరవ తీసుకున్నటువంటి పోలీసులపై కూడా దాడి జరగడంతో అక్కడున్న వారు ఆశ్యర్యపోయారు.
ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే ఘర్షణకు పాల్పడినటువంటి నిందితులను పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు నిందితులు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సోసైటీలోకి రాకుండా కూడా నిందితులు అడ్డుకున్నారు. అలాగే మరికొంత మంది స్థానికులు కూడా పోలీసుల పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే పోలీసులు కూడా తమపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కేళ్లారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Greater Noida West की सोसाइटी में पार्किंग को लेकर विवाद, वीडियो बनाने वाली महिला का पुलिस ने छीना मोबाइल..#gulynews #GreaterNoida #society #Video @noida_authority @noidapolice pic.twitter.com/4lh3j9EWfd
— Guly News (@gulynews) August 14, 2023
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో దారుణాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు జరగడం, మూక దాడులు వంటివి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు. మరోవిషయం ఏంటంటే కొన్ని గొడవలు మరీ ఎక్కువై హత్యలు తీసుకునేవరకు కూడా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటీజన్ల విభిన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..