Jaguar vs Crocodile: నీళ్లలోని మొసలిని వేటాడిన ఆడ జాగ్వర్.. ఎంత పద్ధతిగా పట్టేసిందో మీరే చూడండి..

Jaguar vs Crocodile: సింహం, పులి, చిరుత, జాగ్వార్, మొసలి వంటివి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రసిద్ధి. మొసలికి నీటిలో బలమైతే.. మిగిలినవాటికి నేలపై బలం. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో..

Jaguar vs Crocodile: నీళ్లలోని మొసలిని వేటాడిన ఆడ జాగ్వర్.. ఎంత పద్ధతిగా పట్టేసిందో మీరే చూడండి..
Jaguar Vs Crocodiles

Updated on: Jun 20, 2023 | 6:55 PM

Jaguar vs Crocodile: సింహం, పులి, చిరుత, జాగ్వార్, మొసలి వంటివి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రసిద్ధి. మొసలికి నీటిలో బలమైతే.. మిగిలినవాటికి నేలపై బలం. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇవి వేటాడే పద్ధతి చాలా క్రూరంగా ఉన్నప్పటికీ చూడడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. అయితే వీటిలో ఇవే వేటాడుకోవడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. అది కూడా కెమెరాకు చిక్కడం అంటే మరీ అరుదు. కానీ చిక్కింది. ఆ వీడియోనే ప్రస్తుతం నెటిజన్ల ఆదరణ పొందుతూ నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ ఆడ జాగ్వర్ నీటిలో బలంగా ఉండే మొసలిని వేటాడింది. అందుకోసం నీటిలోకే వెళ్లి మొసలిపై మెరుపుదాడి చేసి దాన్ని నోటకరుచుకుని నేలపైకి వచ్చింది.  అయితే ఆ మొసలిని జాగ్వర్ తినేసిందా.. లేక ఆ రెప్టైల్ తప్పించుకుని నీటిలోకి వెళ్లిపోయిందా అనేది తెలియరాలేదు. ఏది ఎలా జరిగినా నెటిజన్లు మాత్రం ఈ వీడియోను తెగ ఆదరిస్తున్నారు. ఆ వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

Figensport అనే ట్విట్టర్ ID నుంచి షేర్ అయిన ఈ వీడియో కేవలం 32 సెకెన్లు మాత్రమే ఉంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు జాగ్వర్ ఆడదే అయినప్పటికీ ధైర్యం ప్రదర్శించిందని, వేగంలోనే కాదు వేటలోనూ జాగ్వర్లు దిగ్గజాలేేనని, కెమెరామ్యాన్‌ని జాగ్వర్ వదిలేసి తప్పు చేసిందంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 24 వేలకు పైగా వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..