ఆఫీసు వాతావరణంతో విసుగెత్తిపోయిన ఓ యువకుడు ఇక తట్టుకోలేనంటూ వెంటనే రాజీనామా చేశాడు. అయితే, ఆఫీస్‌లో అతని చివరి రోజున తన స్నేహితులు ఇచ్చి వీడ్కోలు మాత్రం నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. అది చూసి అందరు షాక్ అయ్యారు.. చివరకు ఆఫీస్‌లో బాస్ కూడా అది భరించలేక పోయాడు. వారిపై అరుపులు, కేకలు వేస్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేకు చెందిన సేల్స్ అసోసియేట్ అనికేత్ తన ఆఫీసులో టార్చర్, భయానక వాతావరణాన్ని భరించలేకపోయాడు. బాస్ పెట్టే రూల్స్‌తో విసిగిపోయాడు.. ఇదంతా తనవల్ల కాదంటూ.. వెరైటీ రీతిలో వీడ్కోలు పలికాడు. అనికేత్ ఉద్యోగంతో మనస్తాపం చెంది మొదట రాజీనామా చేశాడు. ఆ తర్వాత, విభిన్న స్టైల్లో వీడ్కోలు మార్గం ఎంచుకున్నాడు. ఆఫీస్ బయట గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆఫీస్‌లో అనికేత్‌కి ఆఖరి రోజు కావడంతో అతని స్నేహితులు డ్రమ్స్‌తో వచ్చి ఆఫీసు బయట హంగామా చేశారు. కానీ, అది అతని యజమానికి అస్సలు నచ్చలేదు. అతను మరింత కోపంతో, కేకలు వేయడం మొదలుపెట్టాడు. వాళ్లందరినీ అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు ఈ వీడియో అతని స్నేహితుల ద్వారా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో, అనికేత్ మరియు అతని స్నేహితులకు, ఇది కేవలం వీడ్కోలు మాత్రమే కాదు. చాలీ చాలని జీతంతో ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ..ఎలాంటి గౌరవం లేకపోవడంపై నిరసన అంటున్నారు.
Resignation ho to Aisa.
A man from Pune quit his toxic job and celebrated with Dhol outside the office.
🙌🙌pic.twitter.com/FeRbkMgz5n— Abhishek (@vicharabhio) April 26, 2024
సోషల్ మీడియాలో యూజర్లు వీడియో చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనికేత్ ధైర్యాన్ని కొనియాడుతూ చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వాస్తవానికి, విషపూరిత వాతావరణంతో ఇబ్బంది పడినప్పటికీ, చాలా మంది ఏదో ఒకవిధంగా అలాంటి పరిస్థితుల్లో పని చేస్తూనే ఉన్నారు. అనికేత్ లాంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. వారు అలాంటి బానిసత్వాన్ని వదిలించుకోవడమే కాకుండా, విషపూరితమైన పని సంస్కృతి సమస్యను విభిన్నంగా హైలైట్ చేస్తారని అంటున్నారు. అనికేత్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…