Viral : అరె.. మొక్కజొన్న చేను భలే ఉందే అనుకునేరు.. లోపలికి వెళ్తే కళ్లు తిరుగుతాయ్..

|

Apr 25, 2024 | 2:05 PM

పంటల దిగుబడి తక్కువగా ఉందో,, లేదా పండిన పంటకు గిట్టుబాటు ధర లేదో.. లేదా ఎవరైనా డబ్బు ఆశ చూపారో తెలియదు. ఇటీవల కాలంలో రైతులు ట్రాక్ తప్పుతున్నారు. అనసరంగా.. అక్రమ పద్దతులు.. అనుసరించి... జైల్లో పడుతున్నారు. తాజాగా...

Viral : అరె.. మొక్కజొన్న చేను భలే ఉందే అనుకునేరు.. లోపలికి వెళ్తే కళ్లు తిరుగుతాయ్..
Cornfield (representative image)
Follow us on

ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆశ కావొచ్చు.. లేదా పంటలు వేస్తే గిట్టుబాటు అవుతుందని కావొచ్చు. కొందరు రైతులు ట్రాక్ తప్పుతున్నారు. అన్నం పెట్టే ప్రొఫెషన్లో ఉన్నవారు అక్రమ మార్గాల్లో పయనించి.. జైల్లో చిక్కుకుంటున్నారు. పంటల మధ్యలో దిక్కుమాలిన గంజాయిని అంతర పంటగా పండిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా పూణెలోని చకన్ సమీపంలోని అగర్వాడీకి చెందిన ఓ రైతు మొక్కజొన్న పొలంలో 66 గంజాయి మొక్కలు నాటాడు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి.. గంజాయి ధ్వంసం చేశారు. మొత్తం 11 లక్షల 50 వేల రూపాయల విలువైన 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం గంజాయిని సీజ్ చేసినట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి పెంచిన రైతును అరెస్ట్ చేశారు. (Source)

మధిరలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు

ఖమ్మం జిల్లా మధిరలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు యువకులను మధిర పోలీసులు అరెస్టు చేశారు.  వారి వద్ద నుండి ఒక కేజీ 380 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. , దాని విలువ రూ.27,600 ఉంటుందని తెలిపారు.  నందిగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న మైలవరంనకు చెందిన షేక్ జాఫర్, తమ్మిశెట్టి  నరసింహారావులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని చెక్ చేయగా..  వద్ద గంజాయి దొరికినట్లు తెలిపారు. వీరికి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మధు ద్వారా మైలవరానికి చెందిన శివ వద్దకు గంజాయి సప్లై అవుతుందని పోలీసులు తెలిపారు. శివ వద్ద నుండి కొనుగోలు చేసిన జాఫర్, నరసింహారావు వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..