Cops Save Woman: మెట్రో స్టేషన్‌లో అప్పటివరకు ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమైందో ఏమో కానీ ఓ యువతి మెట్రో స్టేషన్ పైనుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇంతలో పోలీసులు అక్కడికి చేరకున్నారు. వారిని చూసిన ఆ యువతి దూకేస్తానంటూ బెదిరించింది. ఈ క్రమంలో ఆమెను చిన్నగా మాటల్లోకి దించిన పోలీసులు.. ప్రాణాలకు తెగించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల తెగువను చూసి నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం, ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలోని ఫరిదాబాద్‌లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్ సెక్టార్ 28 మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
ఫరీదాబాద్ సెక్టార్ 28 మెట్రో స్టేషన్‌లో శనివారం సాయంత్రం బాల్కనీ పైకి ఓ యువతి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే.. ఇంతలో సమాచారం అందుకున్న ఎస్సై ధన్ ప్రకాశ్ కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ కింద ఉన్న ఎస్సై చిన్నగా ఆ యువతిని మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలో కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ స్టేషన్ బాల్కనీకి చేరుకొని రెప్పపాటులో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి కూడా బాల్కానీ గోడపైకి దిగి యువతిని పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరు ఆమెను పైకి చేర్చారు.
ऐसा #फ़िल्मों में भी नहीं होता।
जान देने पर अमादा #लड़की को जान हथेली पर रख कर बचाया।
जाँबाज़ #पुलिस कर्मी को बधाई। #कहो_ना_कहो pic.twitter.com/sPZ5bjkZOm
— People’s Police – Faridabad Police (@FBDPolice) July 24, 2021
Also Read: