లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్(Long Distance Relationship) గురించి మీరు వినే ఉంటారు. ఎప్పటినుంచో దూరంగా ఉంటూ.. సమయం వచ్చినప్పుడు కలుసుకుంటే.. భాగస్వాముల ఇద్దరిలోనూ కలిగే ఆనందం చెప్పలేనిది. సరిగ్గా ఇక్కడ ఓ యువతి కూడా అదే పట్టరాని ఆనందంతో విదేశాల నుంచి వచ్చిన తన భాగస్వామిని హాగ్ చేసుకోవాలని ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో అంతా రివర్సయింది.
వివరాల్లోకి వెళ్తే.. విదేశాల నుంచి వచ్చిన తన లవర్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఓ యువతి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది. అతడ్ని చాలా రోజుల తర్వాత కలుస్తుండటంతో ఆనందం ఎక్కువై పరుగెత్తుకెళ్ళి హాగ్ చేసుకోవాలనుకుంది. సినిమాలోని హీరోయిన్ మాదిరిగా పరిగెత్తింది.. అయితే ఇంతలోనే సీన్ కాస్తా రివర్సయింది. ఆమె లవర్ స్లిప్ అవ్వడంతో.. అతడు కిందపడ్డాడు. ఈమె కూడా కిందపడి మూతి పళ్లు రాలగొట్టుకుంది. ఇక ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత జరిగినా.. ఆమె చివరికి తన లవర్‌ను గట్టిగా హాగ్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
‘Falling’ in love!
? pic.twitter.com/1m2Ojg2uOY— Harpreet (@CestMoiz) August 8, 2022