Fact Check: షేక్ పేట ఫ్లై ఓవర్‌పై వాహనాలు జారుతున్నాయని ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?

|

Jun 26, 2022 | 9:21 PM

షేక్ పేట ఫ్లై ఓవర్‌పై వాహనాలు జారుతున్నాయని.. పలువురు కిందపడి గాయపడ్డారని ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఈ వార్తలో నిజమెంత..?

Fact Check: షేక్ పేట ఫ్లై ఓవర్‌పై వాహనాలు జారుతున్నాయని ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?
Viral News
Follow us on

Viral Video: ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్.. అందులో డేటా కామన్ అయిపోయింది. సోషల్ మీడియాను కూడా అందరూ యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్టంట ఫేక్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. నిజం గడపదాటే లోపే.. అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుంది అనేది ఓ సామెత. ఇప్పుడు కొన్ని వార్తలు కూడా అలానే సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా షేక్‌పేట ఫ్లైఓవర్ పైన వాహనాలు జారతున్నాయని.. ఈ క్రమంలోనే పలువురు వాహనదారులు వెంటవెంటనే కింద పడ్డారని ఓ వీడియో సర్కులేట్ అవుతుంది. అయితే ఈ వీడియో నిజమే కానీ… అది మన షేక్‌పేట(Shaikpet) ఫ్లై ఓవర్ కాదు. ఈ వీడియో పాకిస్థాన్‌(Pakistan)కు చెందినది. ఇటీవల కరాచీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే వాహనదారులు కిందపడి గాయపడ్డారు. అక్కడి మిలీనియం మాల్ సమీపంలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లోని ఫ్లైఓవర్‌పై వాహనాదారులు పడిపోతున్న ఈ వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఈ ఘటన మన హైదరాబాద్‌ షేక్ పేట్ ఫ్లైఓవర్‌పై జరిగిందని కొందరు సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. పలు మీడియా చానళ్లు సైతం ఈ వార్తను క్యారీ చేశారు. ఇది పూర్తిగా ఫేక్. అది పాకిస్థాన్‌కి సంబంధించిన వీడియో.

కావాలంటే సోర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…