Fact Check: సోషల్ మీడియా (Social Media) తీసుకొచ్చిన సమాచార విప్లవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఏమూలన ఏం జరుగుతోన్నా వెంటనే ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. లైక్‌లు, షేర్లతో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ వీడియాలకు (Viral video) లెక్కేలేకుండా పోతోంది. అయితే కళ్లేదుట జరిగే దాంట్లోనే నిజం ఉందో లేదో తేలియని రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో ఎంత వరకు నిజం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.? అవును సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో మనం చూసేదంతా నిజం కాకపోయి ఉండొచ్చు. ఇటీవల నెట్టింట వైరల్ అయిన ఓ వీడియోకు సంబంధించిన అసలు నిజం ఇదే విషయాన్ని చెబుతోంది.
ఇంతకీ విషయమేంటే.. వరకట్నం కోసం ఓ వరుడు వివాహ వేదికపైనే వదువు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బిహార్‌లోని చప్పల్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందంటూ వార్తలు తెగ సందడి చేశాయి. అడిగిన కట్నం ఇవ్వకపోతే వివాహ వేదిక నుంచి వెళ్లిపోతానని వరుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.
दहेज
इस कालू के कान के नीचे 10 तमाचा मारो pic.twitter.com/DPF2fm02Xl— हम लोग We The People (@humlogindia) March 6, 2022
అయితే నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని తాజాగా తెలిసింది. ఓ జాతీయా మీడియా తెలిపిన వివరాల ప్రకారం సదరు వీడియోలో చేసిందంతా నాటకమని తెలిపారు. అది పూర్తిగా ఫేక్ వీడియో అని తెలిసింది. ఫిబ్రవరి 25న ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. అయితే ఈ పేజీని విక్రమ్ మిశ్రా అనే వ్యక్తి నడిపిస్తున్నారని తేలింది.
మీడియా సంస్థతో మాట్లాడిన విక్రమ్ మిశ్రా.. కొంత మంది బృందంతో కలిసి జై మిథిలా అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వీడియోలను షూటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. సదరు వైరల్ వీడియోలో ఉన్న వధూవరులిద్దరూ నటులేనని విక్రమ్ వార్త సంస్థకు తెలిపారు. దీంతో నెట్టింట వైరల్ అయిన ఆ వీడియో ఫేక్ అని తేలింది.
NAARM Recruitment 2022: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. ఎన్ఏఏఆర్ఎమ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు!