విమానం ఇంజిన్ నుంచి విడుదలయ్యే శక్తి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? విమానం ఇంజిన్ నుంచి వెలువడే శబ్ధం చాలా పెద్దగా ఉంటుంది. ఇక దాని శక్తి కూడా అంతకుమించి ఉంటుంది. విమానం ఇంజిన్ పవర్‌కు కింద నిల్చున్న మనుషులు ఒక్కొక్కరు ఒక్కో దిక్కు ఎగిరిపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో విమానం అప్పుడే టేకాఫ్ అవుతోంది. ఇందులో భాగంగా లాంగ్ లెన్త్ తీసుకుని, టర్న్ తీసుకుంటుంది. అయితే, విమానం టేకాఫ్ అవడాన్ని చూసేందుకు వీలుగా అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ నిల్చుకుని చాలామంది పర్యాటకులు విమానం టేకాఫ్ అవడాన్ని వీక్షిస్తున్నారు. విమానం రానే వచ్చింది. మెల్లగా టర్న్ తీసుకుంటుంది. అయితే, విమానం ఇంజిన్ పవర్ తెలియని జనాలు.. అక్కడే చూస్తూ, కెమెరాలతో వీడియోలు తీస్తూ నిల్చున్నారు. ఫ్లైట్ ఎదురుగా వచ్చినంతసేపు గానే ఉంది. అది టర్న్ తీసుకున్న తరువాత గానీ తెలిసింది దాని ఇంజిన్ శక్తి ఏంటో. ఇంజిన్ భాగం నుంచి వచ్చే పవర్‌ఫుల్ గాలికి రోడ్డుపై నిల్చున్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ తరువాత ఎక్కడివారు అక్కడ సెట్‌రైట్ అయ్యారు. అయితే, విమానం నుంచి ఇలా శక్తి వెలువడటాన్ని జెట్ బ్లాస్ట్ అని పిలుస్తారు.
ఈ వీడియోను Callum Hodgson పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ శక్తిని తక్కువగా అంచనా వేయడం వల్ల జరిగిన పరిణామం ఇది అని క్యాప్షన్ పెట్టారు యూజర్. ఇక వీడియోను చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
ఏవియేషన్ ప్రకారం.. జెట్ బ్లాస్ట్ అంటే జెట్-పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల వెనుక నుండి వచ్చే థ్రస్ట్ ఫోర్స్. విమానం రకం, పర్యావరణ పరిస్థితులు ఆధారంగా దీని ప్రభావం మారే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ జెట్ బ్లాస్ట్ ప్రభావం పెరుగుతంది. ముఖ్యంగా హెవీ-క్యాలిబర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెవీ లోడెడ్ టేకాఫ్ సమయంలో ఈ జెట్ బ్లాస్ట్ పవర్ అధికంగా ఉంటుంది.
Just downloaded my Skiathos videos from last week, here’s a small preview of the absolute chaos when people underestimate the power of aircraft engines! pic.twitter.com/ll2g9nY8AA
— Callum Hodgson (@avgeekcal) June 21, 2023
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..